- Home
- Sports
- Cricket
- సూర్యకుమార్ యాదవ్ నీ పరిస్థితి పగవాడికి కూడా రావొద్దయ్యా... జట్టులోకి వచ్చినట్టే వచ్చి...
సూర్యకుమార్ యాదవ్ నీ పరిస్థితి పగవాడికి కూడా రావొద్దయ్యా... జట్టులోకి వచ్చినట్టే వచ్చి...
ఒకే ఒక్క ఛాన్స్... అంటూ దాదాపు నాలుగేళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్... అయితే వచ్చినట్టే వచ్చి అతనికి జట్టులో చోటు చేజారిపోయింది.

వరుసగా మూడు సీజన్లలో 400+ స్కోరు చేసిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన సూర్యకుమార్ యాదవ్, ఎట్టకేలకు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు...

మొదటి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి చోటు దక్కకపోయినా, రెండో టీ20లో ఇషాన్ కిషన్‌తో కలిసి ఒకేసారి భారత జట్టులో ఆరంగ్రేటం చేశాడు....

అయితే భారత జట్టు తరుపున బ్యాటుతో బరిలో దిగే అవకాశం అతనికి రాలేదు. మూడో టీ20లో లక్ష్యచేధనలో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయినా సూర్యకుమార్ యాదవ్‌ను ఆరో బ్యాట్స్‌మెన్ పంపాలనే ఆలోచన కారణంగా అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు...

మామూలుగా ఆరో స్థానంలో వచ్చే రిషబ్ పంత్‌కి బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇచ్చిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌ను బ్యాటింగ్‌కి పంపాడు. దీంతో మొట్టమొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అదృష్టం సూర్యకుమార్ యాదవ్‌కి దక్కలేదు...

ఆ తర్వాత మ్యాచ్‌లో యాదవ్‌ని తప్పించాడు విరాట్ కోహ్లీ. రెండు మ్యాచులుగా రెస్టు తీసుకుంటున్న రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వడంతో జట్టులో ఓ ప్లేయర్‌ను తప్పించాల్సిన పరిస్థితి....

మొదటి మ్యాచ్‌లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్‌ను, రెండో మ్యాచ్‌లో ఎంట్రీతోనే సత్తా చాటిన ఇషాన్ కిషన్‌ను తీయలేరు... రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయినా టీ20ల్లో టాప్ ర్యాంకర్‌గా ఉన్న కెఎల్ రాహుల్‌ను పక్కనబెట్టలేరు...

దీంతో సూర్యకుమార్ యాదవ్‌ను పక్కనబెట్టాల్సి వచ్చింది. అయితే వచ్చే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రెస్టు తీసుకుని, సూర్యకుమార్ యాదవ్‌ని ఆడిస్తాడని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

అయితే ఐపీఎల్ 2020 సీజన్‌లో జరిగిన చిన్నపాటి గొడవను మనసులో పెట్టుకుని కావాలనే సూర్యకుమార్ యాదవ్‌ను రెండో టీ20లో బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి దింపిన విరాట్, ఆ తర్వాతి మ్యాచ్‌లోనే పక్కనబెట్టాడని అంటున్నారు ముంబై ఇండియన్స్ అభిమానులు...

ముంబై అభిమానులు చేస్తున్న ఆరోపణలకు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఘాటుగా సమాధానం చెబుతున్నారు. సూర్యకుమార్ యాదవ్‌పై పగ తీర్చుకోవాలని అనుకుని ఉంటే, అతనికి తుదిజట్టులో అసలు చోటు ఇచ్చేవాడే కాదని అంటున్నారు...