- Home
- Sports
- Cricket
- అన్ని సార్లు ఫెయిల్ అయినా సూర్యకి మళ్లీ ఛాన్స్ ఇచ్చారంటే... టీమిండియాపై టామ్ మూడీ షాకింగ్ కామెంట్స్...
అన్ని సార్లు ఫెయిల్ అయినా సూర్యకి మళ్లీ ఛాన్స్ ఇచ్చారంటే... టీమిండియాపై టామ్ మూడీ షాకింగ్ కామెంట్స్...
ఆసియా కప్ 2023 టోర్నీకి 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. ఈ టీమ్‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉన్నంతలో మంచి టీమ్‌నే సెలక్ట్ చేశారని సునీల్ గవాస్కర్ కామెంట్ చేస్తే... సంజూ శాంసన్‌ని కాదని తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్‌లను సెలక్ట్ చేయడంపై ట్రోలింగ్‌కి కారణమవుతోంది..

సంజూ శాంసన్, వెస్టిండీస్ టూర్‌లో టీ20 సిరీస్‌లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి ఫెయిల్ అయ్యాడు. అయితే వన్డే టీమ్‌లో అతన్ని ఎంపిక చేయడానికి టీ20ల్లో ఫెయిల్యూర్‌కి కారణంగా చూపించడం ఎంత వరకూ కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు అతని అభిమానులు..
టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసే సంజూ శాంసన్‌ని నిజంగా పూర్తిగా వాడుకోవాలని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి పంపించి ఉండేవాళ్లని టీమిండియా మేనేజ్‌మెంట్‌ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు కేరళ క్రికెట్ ఫ్యాన్స్..
Suryakumar Yadav
అలాగే వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కి ఆసియా కప్ 2023 జట్టులో చోటు దక్కింది. టీ20ల్లో నెం.1 బ్యాటర్‌గా ఉన్నా, వన్డేల్లో మాత్రం తన మార్కు ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఇప్పటిదాకా ఆడలేకపోయాడు సూర్యకుమార్ యాదవ్. అయినా అతనికి ఆసియా కప్ టీమ్‌లో చోటు దక్కింది..
Suryakumar Yadav
వెస్టిండీస్ టూర్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి 7 టీ20 మ్యాచులు మాత్రమే ఆడిన తిలక్ వర్మకు కూడా ఆసియా కప్ 2023 జట్టులో చోటు దక్కింది. అతను నేరుగా ఆసియా కప్‌లోనే వన్డే ఆరంగ్రేటం చేయబోతున్నాడు. ఈ ఎంపికపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, ఐపీఎల్ కోచ్ టామ్ మూడీ..
Suryakumar Yadav
‘సూర్యకుమార్ యాదవ్‌కి ఆసియా కప్ 2023 టోర్నీ జట్టులో చోటు దక్కిందంటే దానికి అతని అదృష్టమే కారణం. అతను క్రీజులో నిలదొక్కుకుంటే పరుగులు ఎలాగైనా చేయగలడు. అతను వన్డే ఫార్మాట్‌లో చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది..
Suryakumar Yadav
టీ20 ఫార్మాట్‌లో మాస్టర్స్ చేసిన సూర్య, వన్డేల్లో ఆడకపోయినా ఆసియా కప్ ఆడబోతున్నాడు. అయితే నా ఉద్దేశంలో సూర్యకుమార్ యాదవ్ కంటే యశస్వి జైస్వాల్‌ని ఆసియా కప్‌కి, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసి ఉంటే బాగుండేది.
Suryakumar Yadav
ఎందుకంటే జైస్వాల్ స్పిన్, పేస్ అనే సంబంధం లేకుండా భారీ షాట్లు ఆడతాడు.. జైస్వాల్ లాంటి ప్లేయర్, టీమ్‌లో ఉండడం మిగిలిన ప్లేయర్లకు అదనపు ఎనర్జీని నింపుతుంది...
Image credit: PTI
స్పిన్ పిచ్‌ల మీద ఓ మణికట్టు స్పిన్నర్ కూడా అవసరం. విదేశాల్లో టోర్నీ ఆడబోతున్నట్టుగా ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యం ఇచ్చి, యజ్వేంద్ర చాహాల్, రవి భిష్ణోయ్ లాంటి స్పిన్నర్లను పక్కనబెట్టేయడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.. ’ అంటూ కామెంట్ చేశాడు టామ్ మూడీ..