- Home
- Sports
- Cricket
- సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు పనికి రాడు! అలాగే ఇషాన్ కిషన్ టీ20ల్లో ఆడలేడు... ఆకాశ్ చోప్రా కామెంట్
సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు పనికి రాడు! అలాగే ఇషాన్ కిషన్ టీ20ల్లో ఆడలేడు... ఆకాశ్ చోప్రా కామెంట్
ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్లను టీమ్‌ల వారీగా విభజిస్తే, ముంబై ఇండియన్స్ ప్లేయర్లే సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తర్వాత 2021లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఒకే మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశారు..

సూర్యకుమార్ యాదవ్, టీ20ల్లో సెన్సేషనల్ పర్ఫామెన్స్‌తో నెం.1 బ్యాటర్‌గా అవతరించాడు. అయితే వన్డేల్లో మాత్రం అతని పర్ఫామెన్స్ ఏ మాత్రం బాగోలేదు.. ఇప్పటిదాకా 26 వన్డేలు ఆడిన సూర్య, 24.33 సగటుతో 504 పరుగులే చేశాడు..
గత 20 వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయినా శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో సూర్యకుమార్ యాదవ్‌కి వరుస అవకాశాలు ఇస్తూనే ఉంది భారత క్రికెట్ టీమ్...
మరోవైపు ఇషాన్ కిషన్, వన్డేల్లో చక్కగా రాణిస్తున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్, టీ20ల్లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పటిదాకా 29 టీ20 మ్యాచులు ఆడిన ఇషాన్ కిషన్, 24.96 సగటుతో 674 పరుగులే చేశాడు..
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 6 పరుగులే చేసి అవుట్ అయ్యాడు ఇషాన్ కిషన్. ఐపీఎల్ 2023 సీజన్‌లో అదరగొట్టిన యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి, టీ20ల్లో వరుసగా విఫలం అవుతున్న ఇషాన్ కిషన్‌కి అవకాశం ఇవ్వడంపై విమర్శలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా..
‘వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ గెలవాలంటే ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ భారీ స్కోర్లు చేయాలి. టీ20ల్లో ఇషాన్ కిషన్ గణాంకాలు ఏ మాత్రం బాగోలేవు. వన్డే ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ ఎంతగా స్ట్రగుల్ అవుతున్నాడో, టీ20ల్లో ఇషాన్ కిషన్ అదే విధంగా ఇబ్బంది పడుతున్నాడు..
ఇషాన్ కిషన్‌కి వరుస అవకాశాలు దక్కుతున్నా, దాన్ని వాడుకోవడంలో అతను సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇషాన్ కిషన్ ఎక్కువ సేపు క్రీజులో ఉంటే, వేగంగా పరుగులు చేయగలడు. లేదంటే సంజూ శాంసన్‌తో ఓపెనింగ్ చేయించడం బెటర్..
ఐపీఎల్‌లో అతనికి ఓపెనర్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. లేదంటే యశస్వి జైస్వాల్‌ని తీసుకొస్తే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ప్లేస్‌లో మరో లెఫ్ట్ హ్యాండర్‌ని రిప్లేస్ చేసినట్టు అవుతుంది. నా ఉద్దేశంలో రెండో టీ20 మ్యాచ్, ఇషాన్ కిషన్‌కి చాలా కీలకంగా మారనుంది.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా..