టీ20 వరల్డ్ కప్‌లో అతనే టీమిండియా ఆయుధం... ఆపడం కష్టమే!...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియా అట్టర్ ఫ్లాప్ షో ఇచ్చింది. ఆరంభానికి ముందు ఆహో! ఓహో! అనే రేంజ్‌లో వార్మప్ మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న భారత జట్టు, తీరా టోర్నీ మొదలయ్యాక అసలు మ్యాచుల్లో చేతులు ఎత్తేసింది. అయితే ఈసారి కూడా టీమిండియాపై భారీ అంచనాలున్నాయి.

Image credit: PTI
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్నారు అభిమానులు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమైనా, జస్ప్రిత్ బుమ్రా ఆడతాడో లేదో తెలియకపోయినా.. టీమిండియాపై అంచనాలు అయితే తగ్గలేదు. దీనికి కారణం ఒకే ఒక్కడు సూర్యకుమార్ యాదవ్...
Image credit: PTI
ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా, ఒకే ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులు క్రియేట్ చేసిన సూర్యకుమార్ యాదవ్, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 2లో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌కి ఏ మాత్రం సహకరించని పిచ్‌పై 33 బంతుల్లో అజేయ హాఫ్ సెంచరీ చేసి సౌతాఫ్రికాతో మొదటి టీ20లో ఘన విజయం అందించాడు సూర్య...
Image credit: PTI
‘కొన్ని నెలలుగా నేను సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ గమనిస్తున్నా. నా దృష్టిలో ఇప్పుడున్న బ్యాటర్లలో ది బెస్ట్ టీ20 బ్యాటర్ సూర్యనే. అందులో ఎలాంటి డౌటు లేదు. అతను 360 డిగ్రీల్లో పరుగులు చేయగలడు...
Image credit: PTI
ఏ సైడ్ వేసినా కొట్టగల బౌలర్‌ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైన పని. ప్రతీ బంతిని ఎంతో జాగ్రత్తగా వేయాలి. బౌండరీలు పోతున్నాయి కదా అని ఫోకస్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. మంచి బాల్స్ కూడా అతను ఈజీగా బౌండరీకి తరలిస్తాడు...
కొన్నిసార్లు మనకి అదృష్టం కలిసి రాలేదని వదిలేయాలి. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌ని చూస్తూ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అతను చాలా మంచి క్రికెట్ ఆడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాకి సూర్యనే అసలైన ఆయుధం...
టీ20 క్రికెట్‌లో బౌలర్ ఎంత చక్కగా బౌలింగ్ చేసినా కొన్నిసార్లు పరుగులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ క్లాస్ బ్యాటర్ల చేతుల్లో తన్నులు తినాల్సి ఉంటుంది. అది బౌలర్ తప్పు కాదు. మొదటి రెండు ఓవర్లలో కూడా బంతి చక్కగా స్వింగ్ అవుతుంది...
Suryakumar Yadav
భారత బౌలింగ్ విభాగం కూడా చాలా పటిష్టంగా మారింది. వాళ్లు కూడా అదిరిపోయే బౌలింగ్ వేస్తున్నారు. ప్రతీ బౌలర్‌కి డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. వాటిని పరిస్థితులకు అనుగుణంగా వాడడంలోనే అతని సత్తా బయటపడుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వేన్ పార్నెల్...