సంజూ శాంసన్ జెర్సీలో వచ్చినా మారని సూర్య లక్... వన్డేల్లో ఎంతగా ఇరికించాలని చూసినా...
సూర్యకుమార్ యాదవ్, నెం.1 టీ20 బ్యాటర్. పొట్టి ఫార్మాట్‌లో దుమ్మురేపుతూ కొన్ని నెలలుగా టాప్ ర్యాంకులో కొనసాగుతూ వస్తున్న సూర్యకుమార్ యాదవ్, వన్డే ఫార్మాట్‌లో మాత్రం ఎందుకనో కుదురుకోలేకపోతున్నాడు..
Suryakumar Yadav
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసినా, బౌలర్లు మారినా... సూర్య బ్యాటు నుంచి పరుగులైతే రావడం లేదు..
Image credit: PTI
అయినా సరే, అతన్ని ఎలాగైనా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడించాలని ఫిక్స్ అయిన రోహిత్ శర్మ అండ్ కో... వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మరోసారి సూర్యకి అవకాశం ఇచ్చారు. అయినా తీరు మారలేదు..
Suryakumar Yadav
గత ఆరు వన్డేల్లో నాలుగు సార్లు డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదే సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 26 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్..
ఈ మధ్య కాలంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటు నుంచి వచ్చిన బెస్ట్ పర్ఫామెన్స్ ఇదే. ఇదే మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 208 పరుగులు చేసి, వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. తాజాగా స్కాట్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతుల్లో కూడా మ్యాచులు ఓడిన వెస్టిండీస్ బౌలింగ్‌లో కూడా సూర్య తేలిపోయాడు..
Suryakumar Yadav
ఇంతకుముందు ఓ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ జెర్సీతో కనిపించిన సూర్యకుమార్ యాదవ్, ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ జెర్సీ వేసుకుని ఫీల్డింగ్ చేశాడు. సంజూ శాంసన్ జెర్సీ కూడా సూర్యకి గుడ్ లక్ తెచ్చిపెట్టలేకపోయింది..
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. టీమిండియా కొట్టాల్సిన లక్ష్యం 115 పరుగులే ఉండడంతో రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్‌కి రాకుండా ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్‌లతో ఓపెనింగ్ చేయించారు.
వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఫెయిల్ అవ్వడంతో 115 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలోనూ 70 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రిపరేషన్స్‌గా చెప్పుకుంటున్న ఈ టోర్నీలో టీమిండియా కోరుకున్న ఆరంభం అయితే ఇది కాదు..