అతను విరాట్ కోహ్లీలా కవర్ డ్రైవ్ ఆడలేడు అయినా... సూర్యకుమార్‌పై గౌతమ్ గంభీర్ కామెంట్...
క్రికెట్ ప్రపంచమంతా విరాట్ కోహ్లీ ఆటకు దాసోహం అంటున్నా, గౌతమ్ గంభీర్ మాత్రం అతని ఆటను తుచ్యమైనదిగా తీసిపాడేస్తాడు. నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసి, రెండు సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన విరాట్ కోహ్లీని తక్కువ చేసేందుకు సూర్యను అస్త్రంగా వాడుతున్నాడు గంభీర్...
Image credit: PTI
2013లో ముంబై ఇండియన్స్ తరుపున ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ యాదవ్, 2014లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడాడు. అయితే కేకేఆర్ తరుపున ఫినిషర్‌గా ఆడిన సూర్యకుమార్ యాదవ్ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు...
2018లో తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన సూర్య, టాపార్డర్ బ్యాటర్‌గా మారి ‘మ్యాన్ విన్నర్’ అయిపోయాడు. ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి... ప్రస్తుతం ఐసీసీ టీ20 నెం.1 బ్యాటర్‌గా నిలిచాడు.ఈ ఏడాది దాదాపు 1000 టీ20 పరుగులకు చేరువైన సూర్య, టీమిండియాకి టీ20 వరల్డ్ కప్‌లో ప్రధాన ఆయుధం...
Virat Kohli-Suryakumar Yadav
‘సూర్యకుమార్ యాదవ్‌లో టన్నుల్లో టాలెంట్ ఉంది. అయితే అతన్ని ఇప్పుడు మిస్టర్ 360 లాంటి పేర్లు ఇవ్వకండి. ఎందుకంటే అతను 360 ఆడినా, లేక 180 ఆడినా అది పెద్ద విషయం కాదు. తన ఆటపై సూర్యకు పూర్తి క్లారిటీ ఉంది...
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ప్రతీ ఫార్మాట్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ పరుగులు చేశాడు. త్వరలో అతనికి టెస్టు క్రికెట్‌లో కూడా అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే టెస్టుల్లో సూర్యకుమార్ యాదవ్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ప్లేయర్ అవుతాడు...
Image credit: Getty
విరాట్ కోహ్లీలా అతను అద్భుతమైన కవర్ డ్రైవ్ షాట్స్ ఆడలేడు. అయితే అతను 180+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేస్తాడు. టీ20ల్లో అది చాలా ముఖ్యం. అతను టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సూర్యకుమార్ యాదవ్, టీమిండియాకి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...