- Home
- Sports
- Cricket
- వన్డేల్లో రాణిస్తున్న సంజూ శాంసన్‌ని కాదని, తిలక్ వర్మ, సూర్యలకు ఛాన్స్... ముంబై ప్లేయర్లు కావడం వల్లేనా...
వన్డేల్లో రాణిస్తున్న సంజూ శాంసన్‌ని కాదని, తిలక్ వర్మ, సూర్యలకు ఛాన్స్... ముంబై ప్లేయర్లు కావడం వల్లేనా...
ఆసియా కప్ 2023 టోర్నీకి 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది టీమిండియా. కెఎల్ రాహుల్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో మొదటి రెండు, మూడు మ్యాచులు ఆడడం అనుమానమేనంటూ రోహిత్ శర్మ ప్రకటించాడు. అయితే ఈ టీమ్ ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి..

Sanju Samson-Tilak Varma
ఆసియా కప్ 2023 టోర్నీకి భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌ని ఎంపిక చేయకపోవడంతో పాటు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలకు చోటు కల్పించడంపై తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి...
టీ20ల్లో నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్, వన్డే ఫార్మాట్‌లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్..
Suryakumar Yadav
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లోనూ పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు సూర్య. మొత్తంగా 23 వన్డేలు ఆడిన సూర్య, 24.05 సగటుతో 433 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అయినా అతని టీ20 రికార్డుల ఆధారంగా వన్డే ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేశారు సెలక్టర్లు..
అలాగే ఇప్పటిదాకా వన్డే ఫార్మాట్‌లో ఆరంగ్రేటం చేయని తిలక్ వర్మకు ఆసియా కప్ 2023 జట్టులో చోటు దక్కింది. వెస్టిండీస్ టూర్‌లో 5 టీ20 మ్యాచుల్లో మంచి పర్ఫామెన్స్ కనబర్చిన తిలక్ వర్మ, ఐర్లాండ్‌తో మొదటి టీ20లో డకౌట్ అయ్యాడు. రెండో టీ20లో 1 పరుగు చేసి పెవిలియన్ చేరాడు..
తిలక్ వర్మకి లిస్టు ఏ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. 25 లిస్టు ఏ మ్యాచులు ఆడిన తిలక్ వర్మ, 56.18 సగటుతో 1236 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెఎల్ రాహుల్ మొదటి రెండు మ్యాచులకు అందుబాటులో ఉండకపోవడంతో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మల్లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయం..
సంజూ శాంసన్‌కి వన్డేల్లో మంచి రికార్డు ఉంది. 12 వన్డేలు ఆడిన సంజూ శాంసన్, 55.71 సగటుతో 391 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయినా అతనికి ఆసియా కప్ 2023 టోర్నీ జట్టులో చోటు దక్కలేదు. కేవలం స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే లంకకి వెళ్లబోతున్నాడు సంజూ శాంసన్..
వన్డేల్లో బాగా ఆడుతున్న సంజూ శాంసన్‌ని స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేసి... వన్డేల్లో ఇంకా ఆరంగ్రేటం చేయని తిలక్ వర్మను, వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌ని ఆసియా కప్‌కి ఎంపిక చేయడానికి ఆ ఇద్దరూ ముంబై ఇండియన్స్ ప్లేయర్లు కావడమే కారణమని ఆరోపిస్తున్నారు అభిమానులు...
సంజూ శాంసన్ టీ20ల్లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. దానికి కారణం కూడా టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసే సంజూని లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి పంపడమే... వన్డేల్లో బాగా ఆడుతున్న సంజూకి ఈ ఏడాది చెప్పుకోదగ్గ అవకాశాలు కూడా రాలేదు.
Suryakumar Yadav
సంజూ శాంసన్‌ని మెగా టోర్నీల్లో ఆడించకూడదనే ఉద్దేశంతోనే అతన్ని వన్డేలకు దూరం పెట్టారని ఆరోపిస్తున్నారు అతని ఫ్యాన్స్.. సూర్యకుమార్ యాదవ్ మెగా ఈవెంట్‌లో తన ఫెయిల్యూర్‌ని కొనసాగిస్తే రోహిత్ శర్మ, సెలక్టర్ల తప్పిదానికి టీమిండియా పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు అభిమానులు...