ప్రత్యర్థులకు దడపుట్టించే ప్లేయర్.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav Birthday : భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (SKY) 35వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయన 360-డిగ్రీ బ్యాటింగ్ శైలి, అంతర్జాతీయ విజయాలు, ఐపీఎల్ ప్రయాణం, కెప్టెన్సీ ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.

360 డిగ్రీ స్టైల్ బ్యాటింగ్ తో అదరగొట్టే సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ అశోక్ యాదవ్.. క్రికెట్ అభిమానులు అతన్ని ముద్దుగా SKY అని పిలుచుకుంటారు. స్కై అనే పేరుకు తగ్గట్టుగానే గ్రౌండ్ లో అడుగుపెట్టిన వెంటనే అన్ని వైపులా షాట్స్ ఆడుతూ ప్రత్యర్థి జట్లకు దడపుట్టిస్తాడు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చిపడేస్తాడు.
సూర్యకుమార్ యాదవ్ 1990 సెప్టెంబర్ 14న జన్మించారు. 2025లో ఆయన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ముంబైలో తన డొమెస్టిక్ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన ఆయన ఫియర్ లెస్, ఇన్నోవేటివ్ బ్యాటింగ్ శైలీతో దేశవాళీ క్రికెట్ లోనే కాకుండా అంతర్జాతీయ వేదికపైనా అదిరిపోయే ఇన్నింగ్స్ లను ఆడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. 360 డిగ్రీ బ్యాటింగ్‌తో అద్భుత నైపుణ్యాలతో ఆధునిక టీ20 క్రికెట్‌లో టాప్ ప్లేయర్లలో ఒకరిగా నిలిచారు.
సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్
సూర్యకుమార్ యాదవ్ తన టీ20 ఇంటర్నేషనల్ డెబ్యూ 2021 మార్చి 14న ఇంగ్లాండ్‌పై అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చేశాడు. తన స్కూప్స్, రివర్స్ పాడిల్స్, ర్యాంప్స్ వంటి షాకింగ్ షాట్లతో అభిమానులను అలరించాడు. 2023 చివరలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఆయన ఇండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2022 అక్టోబర్ నుంచి 2024 జూన్ వరకు వరుసగా తొమ్మిది నెలల పాటు ICC T20I బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీలు, అవార్డులు
సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లో అనేక అద్భుత విజయాలు సాధించాడు. 2023 ఆసియా కప్, 2024 ICC పురుషుల టీ20 వరల్డ్ కప్ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కలిసి టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున 2019, 2020లో రెండు టైటిళ్లు దక్కించుకున్నాడు. వ్యక్తిగతంగా 2022, 2023లో ICC పురుషుల టీ20I క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. వరుసగా రెండు సంవత్సరాలు ICC పురుషుల టీ20I జట్టులో చోటు దక్కించుకున్నాడు.
సూర్యకుమార్ యావ్ ఐపీఎల్ ప్రయాణం
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ కెరీర్ 2012లో ముంబై ఇండియన్స్ తరఫున పుణే వారియర్స్‌పై ప్రారంభమైంది. 2014 నుంచి 2017 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. తిరిగి 2018 నుంచి ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగుతున్నాడు. ముంబై తరఫున ఆడుతూ తన బ్యాటింగ్ నైపుణ్యంతో, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో మరింత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు.
సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేకతలు
సూర్యకుమార్ యాదవ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆయన ఆట శైలి. ర్యాంప్స్, స్కూప్స్, రివర్స్ పాడిల్స్ వంటి అద్భుతమైన షాకింగ్ షాట్లతో బౌలర్లను ఆశ్చర్యపరుస్తాడు. 360 డిగ్రీ స్ట్రోక్‌ప్లేతో ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌లో అత్యంత ఉత్సాహకరమైన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. జట్టుకు అవసరమైన సమయంలో దూకుడుగా ఆడి, కెప్టెన్‌గా కూడా తన ప్రతిభను నిరూపించాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటే సూర్య నిజమైన క్రికెట్ ఎంటర్టైనర్‌గా గుర్తింపు పొందాడు.