- Home
- Sports
- Cricket
- కెప్టెన్‌గా పాస్, బ్యాటర్‌గా ఫెయిల్ ! పాకిస్థాన్‌పై సూర్యకుమార్ యాదవ్ రికార్డు ఎలా ఉంది?
కెప్టెన్‌గా పాస్, బ్యాటర్‌గా ఫెయిల్ ! పాకిస్థాన్‌పై సూర్యకుమార్ యాదవ్ రికార్డు ఎలా ఉంది?
suryakumar yadav birthday : టీ20 కెప్టెన్‌గా సక్సెస్ అయినా, బ్యాట్స్‌మన్‌గా విఫలమైన సూర్యకుమార్ యాదవ్ పాక్‌పై ఆసియా కప్ 2025లో తనను తాను నిరూపించుకోవాల్సిన పరీక్షలో ఉన్నారు. ఆదివారం పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. మరి సూర్య బ్యాట్ పవర్ చూపిస్తాడా?

IND vs PAK : ఆసియా కప్ హై వోల్టేజ్ పోరుకు అంతా సిద్ధం
suryakumar yadav birthday: దుబాయ్‌లో జరగబోయే ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ పోరు కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దాయాదుల మధ్య జరిగే మ్యాచ్ రెండు జట్లకూ అత్యంత ప్రాధాన్యం కలిగిఉంది. ఈ రెండు జట్ల మ్యాచ్ అంటే క్రికెట్ లవర్స్ కు పండగే.. మస్తు మజాను అందిస్తుంది. ఈ బిగ్ ఫైట్ కు ముందు, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాది కాలంగా ఒకే హాఫ్ సెంచరీతో సూర్య కుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ గత ఒక సంవత్సరం కాలంలో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించారు. 2024 అక్టోబర్ 12న హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై 75 పరుగులు చేసిన తర్వాత, ఆయన బ్యాటింగ్ ఫామ్ పూర్తిగా పడిపోయింది. పెద్ద ఇన్నింగ్స్ లు రాలేదు. ఆ తరువాత ఆడిన 10 అంతర్జాతీయ టీ20ల్లో, ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 21 పరుగులు మాత్రమే. కెప్టెన్‌గా సక్సెస్ సాధించినా, బ్యాటర్‌గా వరుసగా విఫలమవుతున్నారు.
పాకిస్తాన్ పై సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన ఎలా ఉంది?
పాకిస్తాన్‌పై సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడారు. వీటిలో ఆయన కేవలం 64 పరుగులే చేశారు. బ్యాటింగ్ సగటు 12.80గా ఉంది. పాక్ పై అత్యధిక వ్యక్తిగత స్కోరు కేవలం 18 పరుగులు మాత్రమే. పాక్‌పై తన బలహీనతను అధిగమించి, ఆసియా కప్‌లో తాను ఏమిటో చూపించుకోవాలనే పెద్ద సవాలు ఇప్పుడు సూర్యకుమార్‌కు ఎదురైంది.
కెప్టెన్‌గా పాస్, బ్యాటర్‌గా ఫెయిల్ అయిన సూర్యకుమార్ యాదవ్
2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి 23 అంతర్జాతీయ టీ20ల్లో 565 పరుగులు మాత్రమే చేశారు. ఆయన సగటు 26.57కి పడిపోయింది. ఈ కాలంలో కేవలం నాలుగు హాప్ సెంచరీలు, ఒక సెంచరీ మాత్రమే సాధించారు. కెప్టెన్సీ ఒత్తిడి ఆయన బ్యాటింగ్‌పై ప్రభావం చూపిందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అయిన సూర్య.. ఇప్పుడు కెప్టెన్ గా ఉంటూ బ్యాటర్ గా నిరూపించుకోవాల్సి ఉంది.
ఆసియా కప్‌లో సూర్య కుమార్ యాదవ్ కు పెద్ద పరీక్ష
ఆసియా కప్ 2025 భారత్ జట్టు గెలుపుతో టోర్నీని ప్రారంభించింది. సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ యూఏఈపై 9 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. రెండో మ్యాచ్ లో పాక్ తో తలపడనుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా ఒమన్‌పై గెలుపుతో టోర్నీని మొదటుపెట్టింది. ఇప్పుడు సూపర్ సండే పోరులో భారత జట్టు, పాక్‌ను ఓడించి సూపర్-4 దశలో అడుగుపెట్టాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన అత్యంత కీలకం అయ్యే ఛాన్స్ ఉంది.