సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో 22 మంది... స్టార్లను అట్టిపెట్టుకున్న ఎస్ఆర్‌హెచ్...

First Published Jan 21, 2021, 12:55 PM IST

IPL 2021 సీజన్‌కి ముందు జట్టులో పెద్దగా మార్పులు చేయడానికి ఇష్టపడలేదు సన్‌రైజర్స్ హైదరాబాద్. 2020 ఐపీఎల్ సీజన్‌లో మూడో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్, పాత జట్టును కొనసాగించడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. గత సీజన్‌లో పెద్దగా అవకాశం రాని, రిజర్వు బెంచ్‌కే పరిమితమైన ఐదుగురు క్రికెటర్లను మాత్రమే ఐపీఎల్ 2021 మినీ వేలానికి వదిలేసింది సన్‌రైజర్స్.