MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అల్లుడు ఎప్పుడంటే అప్పుడే... కెఎల్ రాహుల్ - అథియా వివాహంపై సునీల్ శెట్టి కామెంట్...

అల్లుడు ఎప్పుడంటే అప్పుడే... కెఎల్ రాహుల్ - అథియా వివాహంపై సునీల్ శెట్టి కామెంట్...

భారత స్టార్ క్రికెటర్, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ బ్యూటీ అథియా శెట్టితో పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అథియా శెట్టితో కలిసి ఇంగ్లాండ్ టూర్‌లో కలిసి తిరిగిన కెఎల్ రాహుల్, శస్త్ర చికిత్స కోసం జర్మనీ వెళ్లినప్పుడు కూడా గర్ల్‌ ఫ్రెండ్‌ని వెంటతీసుకెళ్లాడు.వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు అటు బీ టౌన్, ఇటు సీ టౌన్ (క్రికెట్ టౌన్) కోడైకూసింది. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు అథియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 25 2022, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందే కెఎల్ రాహుల్- అథియా శెట్టిల వివాహం జరుగుతుందని వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జూన్- జూలై మాసాల్లో కెఎల్ రాహుల్ వివాహం జరుగుతుందని ఓసారి, కాదు సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నాడని మరోసారి వార్తలు వచ్చాయి...

29

ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి. ‘అవును, త్వరలోనే వాళ్లిద్దరి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. అయితే ఎప్పుడు చేసుకోవాలనేది వాళ్ల నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఎందుకంటే కెఎల్ రాహుల్‌కి చాలా బిజీ షెడ్యూల్ ఉంది... నాకు తెలిసి వచ్చే ఆరు నెలలు అతను ఖాళీగా లేదు...

39

ఆసియా కప్, వరల్డ్ కప్, సౌతాఫ్రికా టూర్, ఆస్ట్రేలియా టూర్‌... ఇలా చాలా బిజీగా ఉన్నాడు. అతనికి బ్రేక్ దొరికినప్పుడే పెళ్లి జరుగుతుంది. ఎందుకంటే పెళ్లిని ఒక్క రోజులో ముగించలేం కదా... అమ్మాయి తండ్రిని కాబట్టి పెళ్లి తంతు త్వరగా ముగించాలని నేను అనుకుంటున్నా...

49

అయితే కెఎల్ రాహుల్‌కి బ్రేక్ దొరకాలి కదా... అతని క్యాలెండర్ చూస్తుంటేనే భయమేస్తోంది. అతనికి 1-2 రోజుల బ్రేక్ మాత్రమే ఉంది. ఆ షార్ట్ గ్యాప్‌లో పెళ్లి జరిపించలేం కదా... పెళ్లికి కావాల్సినంత సమయం, సందర్భం అన్నీ కావాలి... త్వరలోనే ప్లాన్ చేస్తాం..’ అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ శెట్టి... 

59

గాయం కారణంగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ టూర్లకు దూరంగా ఉన్న కెఎల్ రాహుల్, జింబాబ్వే టూర్‌కి ప్రకటించిన జట్టులో కూడా తొలుత చోటు దక్కించుకోలేకపోయాడు...

69

ఐపీఎల్ 2021 సీజన్‌ మధ్యలో అపెండిక్స్‌తో బాధపడిన కెఎల్ రాహుల్, రెండేళ్లుగా గాయాలతో పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో ఒక్క మ్యాచ్ ఆడకుండానే గాయంతో స్వదేశానికి వచ్చిన కెఎల్ రాహుల్, సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్ ముందు గాయపడ్డాడు...

79

గాయం నుంచి కోలుకున్న తర్వాత కరోనా బారిన పడడంతో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడలేకపోయాడు కెఎల్ రాహుల్. ఆ తర్వాత కొన్ని రోజులకు కరోనా నుంచి పూర్తిగా రికవరీ కావడంతో జింబాబ్వే టూర్‌కి కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా నియమిస్తూ, అతన్ని హారారేకి పంపింది బీసీసీఐ...

89

భారత క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహార్... గాయపడి జట్టుకి దూరమైన సమయాల్లోనే పెళ్లి పీటలు ఎక్కారు. ఐపీఎల్ 2020 పర్పామెన్స్‌తో టీమిండియా సెలక్ట్ అయిన వరుణ్ చక్రవర్తి, గాయంతో ఆస్ట్రేలియా టూర్‌కి దూరమయ్యాడు. చూస్తే అదే గ్యాప్‌‌లో పెళ్లి చేసుకున్నాడు...

99

అలాగే గాయంతో ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమైన దీపక్ చాహార్, ఆరు నెలల పాటు క్రికెట్‌కి దూరమయ్యాడు. ఈ టైమ్‌ని వేస్ట్ చేయకుండా తన గర్ల్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్నాడు దీపక్ చాహార్. ఇప్పుడు కెఎల్ రాహుల్‌ కూడా ఈ ఇద్దరినీ ఫాలో అయిపోతాడేమోనని ట్రోల్స్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Sooryavanshi : బుమ్రాకే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు.. కోహ్లీ రికార్డుకు ఎసరు!
Recommended image2
IPL లో ఎవరూ సాధించలేని అద్భుత రికార్డు సచిన్ సొంతం !
Recommended image3
IPL 2026: ఐపీఎల్ వల్లే నా కెరీర్ నాశనమైంది.. ఢిల్లీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved