వరల్డ్ కప్‌కి క్వాలిఫై కాలేని వెస్టిండీస్‌పై సెంచరీలు చేసి, తొడలు కొట్టుకుంటారా? సునీల్ గవాస్కర్ కామెంట్స్..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో టీమిండియా, నెల రోజులు రెస్ట్ తీసుకుని వెస్టిండీస్ పర్యటనకి వెళ్లింది. ఈ పర్యటనలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి తమ టెస్టు సగటును మెరుగుపర్చుకున్నారు..
తొలి టెస్టులో సెంచరీ చేసుకున్న రోహిత్ శర్మ, టెస్టుల్లో రెండో సెంచరీ నమోదు చేసుకున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్‌లో టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదాడు..
Rohit Sharma
ఈ టెస్టు సిరీస్‌కి ముందు విదేశాల్లో రోహిత్ శర్మ టెస్టు సగటు 37గా ఉంటే, వెస్టిండీస్‌లో 2 టెస్టుల్లో 3 ఇన్నింగ్స్‌ల్లో 80 సగటుతో 240 పరుగులు చేశాడు... ఈ గణాంకాలు, రోహిత్ శర్మ టెస్టు గణాంకాలను మెరుగుపర్చాయి..
Virat Kohli 500th Match
ఐదేళ్లుగా విదేశాల్లో టెస్టు సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ టూర్‌లో దాన్ని అందుకున్నాడు. తొలి టెస్టులో 76 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, రెండో టెస్టులో 121 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
11 నెలలుగా మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, రెండు టెస్టుల్లో 98.5 సగటుతో 197 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌కి ముందు పడిపోతూ వచ్చిన విరాట్ కోహ్లీ టెస్టు సగటు, మళ్లీ 49+కి చేరింది. రెండో టెస్టులో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ అందుకుని ఉంటే 50+ టెస్టు సగటు కూడా అందుకునేవాడు..
Rohit Sharma
‘వెస్టిండీస్ బౌలింగ్ అటాక్ ఎంత వీక్‌గా ఉందో అందరికీ తెలుసు. నెదర్లాండ్స్, స్కాట్లాండ్‌పైన కూడా వాళ్లు గెలవలేకపోయారు. అలాంటి విండీస్‌పై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రతాపం చూపిస్తూ సెంచరీలు చేసుకున్నారు. వరల్డ్ కప్‌కి కూడా అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్‌పై సెంచరీలు చేసి, తోడలు కొట్టుకున్నారా?
సెలక్టర్లకు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో బాగా తెలుసు. వెస్టిండీస్‌లో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి ఉంటే, వాళ్లకు చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరికి ఉండేది. కుర్రాళ్లను పరీక్షించేందుకు వెస్టిండీస్ లాంటి దేశాలపై సిరీస్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి..
Rohit Sharma
ఇప్పుడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మెన్‌గా అజిత్ అగార్కర్ బాధ్యతలు తీసుకున్నాడు. అతను టీమ్‌ని ఎలా నిర్మిస్తాడో చూడాలి. సీనియర్లతో నిండిన టీమ్ నుంచి ఫ్యూచర్ టీమ్‌ని నిర్మించడం అంత తేలికైన విషయం కాదు...
స్టార్ ప్లేయర్లకు కాకుండా మ్యాచ్ విన్నర్లకు టీమ్‌లో అవకాశం దక్కినప్పుడే టీమ్ మారుతుంది. అగార్కర్ కూడా అదే స్టార్లు, సీనియర్లు అని పట్టుకుని వేలాడితే, టీమిండియాలో ఎలాంటి మార్పు ఉండదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్..