MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆ ప్రశ్న అడగడం తప్పు, నేను సమాధానం చెప్పడం తప్పు... సునీల్ గవాస్కర్ వివరణ...

ఆ ప్రశ్న అడగడం తప్పు, నేను సమాధానం చెప్పడం తప్పు... సునీల్ గవాస్కర్ వివరణ...

‘షేన్ వార్న్ గొప్ప స్నిన్నర్ కాదు, కేవలం ఆర్డనరీ బౌలర్...’ అంటూ సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎట్టకేలకు క్రికెట్ ఫ్యాన్స్‌ను క్షమాపణలు కోరాడు ‘లిటిల్ మాస్టర్’...   

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 08 2022, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ అకాల మరణంతో క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. షేన్ వార్న్ ఆస్ట్రేలియా టీమ్‌కి, ఐపీఎల్‌కి, క్రికెట్ ప్రపంచానికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆసీస్ లెజెండ్‌కి నివాళులు అర్పిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

షేన్ వార్న్ మరణ వార్త తెలిసిన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వంటి మాజీ భారత లెజెండరీ క్రికెటర్లు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు...

312

అయితే భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం షేన్ వార్న్‌ గొప్ప స్పిన్నర్ కాదని, ఓ ఆర్డనరీ స్పిన్నర్ అంటూ కామెంట్ చేయడంతో తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది...

412

‘షేన్ వార్న్ ఆల్‌ టైం గ్రేట్ స్పిన్నర్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అతని కంటే భారత్‌లో చాలా గొప్ప స్పిన్నర్లు ఉన్నారు. ముత్తయ్య మురళీధరన్ కూడా గొప్ప స్పిన్నర్..
షేన్ వార్న్‌కి భారత ఉపఖండ పిచ్‌లపై పెద్ద చెప్పుకోదగ్గ రికార్డులు లేవు. అతను ఇక్కడ ఓ సాధారణ స్పిన్నర్‌గానే పర్పామ్ చేశాడు...

512

వార్న్ ఇక్కడ పెద్దగా రాణించలేకపోయాడు. షేన్ వార్న్‌తో పోలిస్తే ముత్తయ్య మురళీధరన్, అనిల్ కుంబ్లే లాంటి స్పిన్నర్లు ఉపఖండ పిచ్‌ల పైనే కాకుండా విదేశీ పిచ్‌లపైన కూడా వికెట్లు రాబట్టగలిగారు... కాబట్టి షేన్ వార్న్ నా దృష్టిలో గ్రేటెస్ట్ కాదు.. ’ అంటూ వ్యాఖ్యానించాడు సునీల్ గవాస్కర్...

612

షేన్ వార్న్ చనిపోయిన తర్వాత ఇలాంటి కామెంట్లు చేయడంతో సునీల్ గవాస్కర్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. సమయం, సందర్భం తెలియకుండా ఇలాంటి కామెంట్లు చేయడమేంటని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

712

వ్యక్తిగా, స్పిన్నర్‌గా షేన్ వార్న్‌కి గౌరవం ఇవ్వకపోయినా క్రికెట్ ప్రపంచానికి ఆయన అందించిన సేవలకు గవాస్కర్ విలువ ఇచ్చిఉంటే బాగుండేదని అంటున్నారు నెటిజన్లు...

812

స్వదేశంలో పరుగులు చేసే రోహిత్ శర్మ, ముంబై ప్లేయర్ కావడంతో గొప్ప క్రికెటర్ అని కీర్తించే సునీల్ గవాస్కర్... షేన్ వార్న్ మరణాన్ని కూడా భారత స్పిన్నర్లు, ముత్తయ్య మురళీధరన్ మంచి స్పిన్నర్లని నిరూపించుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు... 

912

విమర్శలు చేయడానికి కూడా సమయం, సందర్భం అనేవి ఉంటాయని... ఓ లెజెండరీ క్రికెటర్ అకాల మరణంతో క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని నిలదీస్తున్నారు. 

1012

తాజాగా సోషల్ మీడియా ద్వారా తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన సునీల్ గవాస్కర్, అసందర్భ వ్యాఖ్యలకు క్షమాపణలు కోరాడు... 

1112

‘24 గంటల వ్యవధిలో క్రికెట్ ప్రపంచంలో రాడీ మార్ష్, షేన్ వార్న్ వంటి దిగ్గజాలను కోల్పోవడం బాధాకరం. అయితే నేను ఆ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ‘షేన్ వార్న్ గొప్ప స్పిన్నర్’ అని యాంకర్ నన్ను ప్రశ్నించాడు, నేను ఏ మాత్రం ఆలోచించకుండా నా అభిప్రాయం చెప్పాను...

1212

ఆ సమయంలో అతను ఆ ప్రశ్న అడగడం తప్పు, నేను సమాధానం చెప్పడం మరీ తప్పు... నా వ్యాఖ్యలతో బాధపడిన ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెబుతున్నా...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్... 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Video: విధి ఎంత విచిత్రమైందో.. ఒకప్పుడు స్టార్ క్రికెటర్, ప్రస్తుతం దారుణ పరిస్థితి
Recommended image2
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image3
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved