- Home
- Sports
- Cricket
- సౌతాఫ్రికా టూర్ తర్వాత టీమిండియా భయపడి ఉంటుంది, అందుకే అలాంటి పిచ్.. సునీల్ గవాస్కర్ కామెంట్...
సౌతాఫ్రికా టూర్ తర్వాత టీమిండియా భయపడి ఉంటుంది, అందుకే అలాంటి పిచ్.. సునీల్ గవాస్కర్ కామెంట్...
భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నారు. షేన్ వార్న్ గొప్ప స్పిన్నర్ కాదని, ఓ ఆర్డినరీ ప్లేయర్ అంటూ వివాదాస్పద కామెంట్లు చేసిన సునీల్ గవాస్కర్, తాజాగా బెంగళూరు పిచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు...

భారత్- శ్రీలంక మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన డే - నైట్ టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి షాక్ ఇస్తూ... పిచ్ అన్యూహ్యంగా స్పిన్నర్లకు సహకరించింది.
మొదటి సెషన్‌లో నాలుగు, రెండో సెషన్‌లో ఆరు... ఇలా వరుస వికెట్లు కోల్పోయిన టీమిండియా, రెండు సెషన్లు కూడా ముగియకుండానే ఆలౌట్ అయ్యింది... ఆ తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక కూడా టపాటాపా వికెట్లు కోల్పోవడంతో మొదటి రోజే 16 వికెట్లు పడ్డాయి. రెండో రోజు 14 వికెట్లు పడ్డాయి...
రెండో రోజు ఆఖర్లో రెండోసారి బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక ఓ వికెట్ కోల్పోగా... మూడో రోజు మిగిలిన 9 వికెట్లు కోల్పోవడానికి పెద్ద సమయమేమీ దక్కలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు, శ్రీలంకను 238 పరుగుల తేడాతో చిత్తు చేసి, సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది...
కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రోహిత్ శర్మకు ఇది తొలి టెస్టు సిరీస్ విజయం. అయితే భారత్ - శ్రీలంక మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు పిచ్‌కి ‘బిలో యావరేజ్’ రేటింగ్ ఇచ్చింది ఐసీసీ.
ఐసీసీ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ‘పిచ్ మొదటి రోజు మొదటి సెషన్ నుంచే స్పిన్నర్లకు సహకరించడం మొదలెట్టింది. సెషన్లు గడిచేకొద్ది బౌలర్లకు ఎక్కువ సహకారం లభించడం మొదలెట్టింది. నా ఉద్దేశంతో బంతికి, బ్యాటుకి సమతూకమైన పిచ్ కాదు...’ అంటూ బెంగళూరు పిచ్‌పై రేటింగ్ ఇచ్చాడు...
బౌలర్లకు సహకరించే పిచ్‌ను రూపొందించినందుకు చిన్నస్వామి స్టేడియానికి ఓ డీ మెరిట్ పాయింట్‌ను ఇచ్చింది ఐసీసీ. తాజాగా దీనిపై కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...
‘వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పైకి వెళ్లాలంటే శ్రీలంకతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం టీమిండియాకి చాలా అవసరం. సౌతాఫ్రికాలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన తర్వాత వాళ్లు రిస్క్ తీసుకోవడం ఎందుకని భావించి ఉండొచ్చు...
అందుకే స్పిన్ పిచ్‌ని తయారు చేయించారు. స్టేడియానికి వచ్చే ప్రేక్షకులు, టీమిండియా బ్యాటర్ల నుంచి సెంచరీలు ఆశిస్తారు. ఐదు రోజుల పాటు టెస్టు మజాను ఆస్వాదించాలని అనుకుంటారు. కానీ వారి కోరిక నెరవేరలేదు...
ఇలాంటి పిచ్‌లపై బ్యాటింగ్ చేయాలంటే కేవలం టెక్నిక్ ఉంటే సరిపోదు, అంతకుమించి ఓపిక, సహనంతో పాటు అదృష్టం కూడా కావాలి. ఈ విషయంలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ చక్కగా రాణించారు...
రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తే... ఈ పిచ్‌పై డేరింగ్‌తో పాటు కాస్త లక్ కూడా కలిసి రావాలనే విషయం అర్థమవుతోంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...