- Home
- Sports
- Cricket
- ఆమె ఫిగర్ చూసి ఫిదా అయిపోయా! స్టువర్ట్ బ్రాడ్‌ని చూస్తే లెస్బియన్‌లా కనిపించాడంటూ అండర్సన్ కామెంట్...
ఆమె ఫిగర్ చూసి ఫిదా అయిపోయా! స్టువర్ట్ బ్రాడ్‌ని చూస్తే లెస్బియన్‌లా కనిపించాడంటూ అండర్సన్ కామెంట్...
ఇంగ్లాండ్ టెస్టు బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, 17 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కి ముగింపు పలికాడు. కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్టు, తన క్రికెట్‌కి ఆఖరిదని ప్రకటించాడు. స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి అత్యధికంగా 1048 వికెట్లు పడగొట్టిన బౌలింగ్ జోడిగా టాప్‌లో ఉన్న జేమ్స్ అండర్సన్, బ్రాడ్‌ని మొదటిసారి చూసినప్పుడు అమ్మాయి అనుకుని పొరబడ్డాడట...

Stuart Broad
‘మొదటి సారి స్టువర్ట్ బ్రాడ్ డ్రెస్సింగ్ రూమ్‌కి నడుచుకుంటూ వస్తుంటే చూశా. కాస్త పింక్ రంగులో ఉన్న జట్టు, నీలం రంగులో మెరుస్తున్న కళ్లు, అబ్బా... పర్ఫెక్ట్ ఫిగర్ ఉన్న అమ్మాయిలా అనిపించాడు. ఆమె ఎవరో చాలా అందంగా ఉందిరా అని తన అందానికి ఫిదా అయిపోయా...
మా కోచ్, అతన్ని పరిచయం చేయగానే షాక్ తగిలినంత పనైంది. మేం ఇద్దరం కలిసి 1000కి పైగా వికెట్లు తీశామంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. మా స్కిల్స్ పూర్తిగా డిఫరెంట్. అందుకే మేం ఎప్పుడూ ఒకరితో ఒకరం పోటీపడం. ఎవరు సక్సెస్ అయినా మరోకరం సెలబ్రేట్ చేసుకుంటాం..
James Anderson and Stuart Broad
స్టువర్ట్ బ్రాడ్, ప్రెషర్ పరిస్థితుల్లో చాలా చక్కగా బౌలింగ్ చేస్తాడు. అతని బౌలింగ్‌లో సీమ్ ఎక్కువగా ఉంటే, నా బౌలింగ్‌లో స్వింగ్ ఉంటుంది. అందుకే పరిస్థితులను బట్టి మాలో ఎవరిని ఆడించాలో టీమ్‌కే వదిలేస్తాం...
బ్యాటర్ల మాదిరిగానే బౌలర్లకు కూడా భాగస్వామ్యం చాలా అవసరం. ఓ ఎండ్‌లో ప్రెషర్ క్రియేట్ చేస్తుంటే, మరో ఎండ్‌లో బౌలర్‌కి వికెట్లు తీయడం ఈజీ అవుతుంది.
అందుకే మేం ఇద్దరు ప్రతీ మ్యాచ్‌కి ముందు ప్రణాళికలు రచించుకుంటాం. ప్రతీ ఓవర్‌కి ముందు అవసరమైతే ప్లాన్స్ మార్చుకుంటాం.. ’ అంటూ తన పుస్తకం ‘బౌల్, స్లీప్, రిపీట్’లో రాసుకొచ్చాడు జేమ్స్ అండర్సన్...
స్టువర్ట్ బ్రాడ్ గురించి 2010లో జేమ్స్ అండర్సన్ వేసిన ట్వీట్ కూడా అప్పట్లో వైరల్ అయ్యింది. ‘బ్రాడీ కొత్త హెయిర్‌కట్‌ను ఇప్పుడే చూశా. దాని గురించి క్లియర్‌గా చెప్పలేను కానీ అతను అచ్చు ఓ 15 ఏళ్ల లెస్బియన్‌లాగా కనిపించాడు... ’ అంటూ 2010, ఫిబ్రవరి 20న ట్వీట్ చేశాడు జేమ్స్ అండర్సన్.