తుఫాను బ్యాట్స్‌మన్ వస్తున్నాడు... భారత్ బలం రెట్టింపు !
IND vs ENG: ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లో భారత్ బలం మరింత పెరగనుంది. తుఫాను బ్యాట్స్ మెన్ తిరిగి భారత జట్టులోకి వస్తున్నాడు !

India vs England : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ మధ్య భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక తుఫాను బ్యాట్స్‌మన్‌ను టీమిండియాలోకి చేర్చుకుంది. ఈ బ్యాట్స్‌మెన్ జట్టులోకి రావడంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు బలం రెట్టింపు అయింది.
అతనే ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే ముంబైకి చెందిన శివమ్ దూబే. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం భారత జట్టులోకి అతను వస్తున్నాడు. తెలుగు రైజింగ్ స్టార్ నితీష్ కుమార్ రెడ్డి కండరాల ఒత్తిడి కారణంగా సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో దుబే జట్టులోకి వస్తున్నాడు.
శివం దుబే, నితీష్ రెడ్డిల గురించి బీసీసీఐ అప్‌డేట్
జనవరి 24న చెన్నైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి సైడ్ స్ట్రెయిన్ గాయంతో బాధపడ్డాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. దీంతో అతను ప్రస్తుత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యాడు.
ఈ క్రమంలోనే నితీష్ రెడ్డి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నారు. 21 ఏళ్ల రెడ్డి తిరిగి పోటీ క్రికెట్‌లోకి రావడానికి దాదాపు నాలుగు వారాలు పట్టవచ్చు. చివరిసారి నితీష్ కుమార్ రెడ్డి జింబాబ్వేలో తన మొదటి టీ20 పర్యటనలో గాయం కారణంగా భారత జట్టుకు దూరంగా ఉండవలసి వచ్చింది. ఇప్పుడు అతని స్థానంలో శివం దూబే భారత జట్టులో చేరనున్నాడు.
Shivam Dube with Indian Team
తుఫాను ఇన్నింగ్స్ లకు పెట్టింది పేరు.. శివమ్ దుబే
శివమ్ దూబే రూపంలో ఓ తుఫాను బ్యాట్స్‌మెన్ టీమిండియాలోకి అడుగుపెట్టాడు. జనవరి 28న రాజ్‌కోట్‌లో జరిగే మూడో టీ20 మ్యాచ్‌లోపు అతను జట్టులో చేరే అవకాశం ఉంది. గతేడాది జూలైలో శ్రీలంకతో దూబే తన చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. వెన్ను గాయం కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు.
గాయం నుంచి కోలుకున్న తర్వాత అతను ఇటీవలే దేశవాళీ క్రికెట్‌లోకి వచ్చాడు. అయితే, ఈ 31 ఏళ్ల ఆటగాడిని ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో జట్టులోకి తీసుకోలేదు. దూబే తన తుఫాను బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో తన పేలుడు బ్యాటింగ్‌తో బౌలర్లను చిత్తు చేసే సత్తా అతని సొంతం.
గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత తన తొలి రంజీ మ్యాచ్‌లో శివమ్ దూబే ఆకట్టుకోలేకపోయాడు. జమ్మూకశ్మీర్‌తో జరిగిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఖాతా తెరవలేకపోయాడు. కానీ, ఆ తర్వాత మంచి న్నింగ్స్ లను ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాటింగ్ చేసే దూబే ఇప్పటివరకు 33 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 135 స్ట్రైక్ రేట్‌తో 448 పరుగులు చేశాడు. మీడియం పేస్ బౌలింగ్‌తో 11 వికెట్లు కూడా తీశాడు.
Shivam Dube
ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టీ20 మ్యాచ్ ల కోసం భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రమణ్‌దీప్ సింగ్.