స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీ... మూడో టెస్టులో ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా...

First Published Jan 8, 2021, 9:30 AM IST

సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 338 పరుగులకి ఆలౌట్ అయ్యింది. గత రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్... క్లాస్ సెంచరీతో అదరగొట్టగా భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొదటి టెస్టు ఆడుతున్న నవ్‌దీప్ సైనీకి రెండు వికెట్లు దక్కగా, లబుషేన్ 91 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

రెండో రోజు లంచ్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది...

ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ 10 బంతుల్లో ఒకే పరుగు చేసి... బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

టిమ్‌పైన్‌ను బుమ్రా అవుట్ చేయడం ఇది ఐదో సారి. టిమ్‌పైన్‌ను అత్యధికసార్లు అవుట్ చేసిన బౌలర్‌గా నిలిచాడు బుమ్రా...

ఆ తర్వాత కొద్దిసేపటికే 13 బంతులాడి పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు ప్యాట్ కమ్మిన్స్...

టెస్టుల్లో ప్యాట్ కమ్మిన్స్ రెండు సార్లు డకౌట్ కాగా... రెండు సందర్భాల్లోనూ రవీంద్ర జడేజానే బౌలర్ కావడం విశేషం...

కమ్మిన్స్ అవుటైన తర్వాత స్టీవ్ స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియాపై టెస్టుల్లో స్టీవ్ స్మిత్‌కి ఇది 8వ సెంచరీ...

201 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న స్టీవ్ స్మిత్‌కి టెస్టుల్లో ఇది 27వ సెంచరీ... ప్రస్తుత తరంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ రికార్డును సమం చేశాడు స్మిత్.

అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 27 టెస్టు సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు స్టీవ్ స్మిత్... బ్రాడ్‌మన్ 70 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా స్మిత్ 136 ఇన్నింగ్స్‌లో 27 సెంచరీలు బాదాడు. 141 ఇన్నింగ్స్‌లో 27 సెంచరీలు చేసిన కోహ్లీ, సచిన్ మూడో స్థానంలో ఉన్నారు.

అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో టీమిండియాపై 8 టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు స్టీవ్ స్మిత్. స్మిత్ 25 ఇన్నింగ్స్‌లో ఏడు సెంచరీలు చేయగా గ్యారీ సోబర్స్ 30, వీవ్ రిచర్డ్స్ 41, రికీ పాంటింగ్ 51 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ అందుకున్నారు.

ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు స్టీవ్ స్మిత్. సచిన్ (20), విరాట్ కోహ్లీ (15), రికీ పాంటింగ్ (14) సెంచరీలతో స్మిత్ (13) కంటే ముందున్నారు.

చివరిగా 2017, మే 25న సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్, 22 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ నమోదుచేశాడు స్టీవ్ స్మిత్. స్మిత్ కెరీర్‌లో సెంచరీకి ఇంత గ్యాప్ రావడం ఇదే తొలిసారి.

మిచెల్ స్టార్క్ వస్తూనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేశాడు.

నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, శుబ్‌‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు మిచెల్ స్టార్క్...

నాథన్ లియాన్‌ను రవీంద్ర జడేజా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో 315 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా...

ఆ తర్వాత జోరు పెంచిన స్టీవ్ స్మిత్, వరుస బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు.  జోష్ హజల్‌వుడ్‌తో కలిసి 10వ వికెట్‌కి 22 పరుగులు జోడించాడు.

226 బంతుల్లో 16 ఫోర్లతో 131 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్... రనౌట్ రూపంలో పెవిలియన్ చేరడంతో 338 పరుగుల వద్ద ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్‌కి తెరపడింది.

భారత బౌలర్లలో జడేజాకి నాలుగు వికెట్లు దక్కగా బుమ్రా, సైనీ రెండేసి వికెట్లు తీశారు. సిరాజ్ ఓ వికెట్ తీయగా అశ్విన్‌కి వికెట్ దక్కకపోవడం విశేషం.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?