- Home
- Sports
- Cricket
- పాపం దసున్ శనక! కోట్ల ఢీల్ మిస్ అయిపోయాడుగా... రెండు వారాల ముందు సిరీస్ జరిగి ఉంటే...
పాపం దసున్ శనక! కోట్ల ఢీల్ మిస్ అయిపోయాడుగా... రెండు వారాల ముందు సిరీస్ జరిగి ఉంటే...
న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మాదిరిగానే రోహిత్ సేన, జోరు ముందు నిలవలేక మూడు మ్యాచుల్లోనూ ఓడి వైట్ వాష్ అయ్యింది శ్రీలంక జట్టు. అయితే టీ20 సిరీస్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ శనక ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు...

వరుసగా రెండు మ్యాచుల్లో కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో ఆఖరి ఓవర్లలో లంకకు మంచి స్కోరు అందించిన దసున్ శనక, మూడు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలతో 124 పరుగులు చేశాడు...
రెండో టీ20లో 19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 47 పరుగులు చేసిన దసున్ శనక, మూడో మ్యాచ్‌లో 38 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసి అదరగొట్టాడు...
మూడు మ్యాచుల్లో కలిపి ఓ వికెట్ కూడా తీసిన దసున్ శనక, వారాల వ్యవధిలో కోట్ల రూపాయల డీల్‌ని మిస్ చేసుకున్నాడు...
ఐపీఎల్ మెగా వేలానికి ముందు భారత జట్టు, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో భారీ సిక్సర్లతో అదరగొట్టిన ఓడియన్ స్మిత్, జాసన్ హోల్డర్ ఐపీఎల్‌లో భారీ ధర దక్కించుకున్నారు...
అలాగే లంక టూర్‌లో భారత జట్టుపై మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన ఆల్‌రౌండర్ వానిందు హసరంగ, దుస్మంత ఛమీరా ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించారు...
వానిందు హసరంగను రూ.10.75 కోట్లకు ఆర్‌సీబీ కొనుగోలు చేయగా, దుస్మంత ఛమీరాని రూ.2 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్, మహీశ్ తీక్షణను రూ.70 లక్షలకు సీఎస్‌కే... చమీకా కరుణరత్నేని రూ.50 లక్షలకు కేకేఆర్, భనుకా రాజపక్షను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...
భారత్‌తో జరిగిన సిరీస్‌కి హసరంగ గాయం కారణంగా దూరం కాగా మిగిలిన ప్లేయర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు...
లంక కెప్టెన్ దసున్ శనక, ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనప్పటికీ అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు...
ఒకవేళ ఇండియా, శ్రీలంక సిరీస్... ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు జరిగి ఉంటే, శనక కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పోటీపడేవని, కనీసం రూ.2 కోట్లు అయినా దక్కించుకునేవాడని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...
ఐపీఎల్ 2021 వేలంలో లంక ప్లేయర్లను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. అయితే కరోనా కారణంగా ఫస్టాఫ్‌కి బ్రేక్ పడడం, ఆసీస్ ప్లేయర్లలో కొందరు సెకండాఫ్‌కి దూరం కావడంతో హసరంగ, తీక్షణ వంటి ప్లేయర్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కింది...
అలాగే ఏ ప్లేయర్ అయినా ఏ కారణంగా అయినా ఐపీఎల్‌కి దూరమైతే, వారి స్థానంలో దసున్ శనకను ఆడించేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించవచ్చు...