MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • SRH vs MI: ఇషాన్ కిష‌న్ కు ఏమైనా పిచ్చిప‌ట్టిందా.. ఏంది సామి ఇది

SRH vs MI: ఇషాన్ కిష‌న్ కు ఏమైనా పిచ్చిప‌ట్టిందా.. ఏంది సామి ఇది

SRH vs MI Ishan Kishan: ఐపీఎల్ 2025 లో ముంబై vs హైదరాబాద్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అవుట్ కాకుండానే క్రీజు వదిలివెళ్లిపోయాడు. ఒక్కసారిగా ప్రత్యర్థి జట్టుతో పాటు గ్రౌండ్ లో ఉన్నఅభిమానులు కూడా షాక్ అయ్యారు. కొంత సమయం ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి కనిపించింది. మొత్తంగా హైద‌రాబాద్ టీమ్ ను క‌ష్టాల్లోకి ప‌డేశాడు.    

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 23 2025, 09:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Ishan Kishan: గత ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపే ఆటతో ఫైనల్ చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అగుగు దూరంలో టైటిల్ ను కోల్పోయింది. అయితే, ఐపీఎల్ 2025 సీజన్ లో ట్రోఫీ గెలిచే టీమ్ గా బరిలోకి దిగింది. కానీ, అనుకున్న విధంగా ఆడటం లేదు.

ఇప్పటి ఈ సీజన్‌లో వరుస ఓటములతో కష్టాల్లో  ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే ప్రతిమ్యాచ్ ను గెలవాల్సిందే. అలాంటి మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఒకరు పిచ్చిపట్టినట్టు చేశాడు. జట్టుతో పాటు అభిమానులకు షాక్ ఇచ్చాడు. వారి నుంచి తీవ్ర అగ్రహానికి గురయ్యాడు.అతనే ఇషాన్ కిషన్.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అవును నిజమే ఇషాన్ కిషన్ అవుట్ కాకుండానే క్రీజు వదిలివెళ్లిపోయాడు. ఒక్కసారిగా ప్రత్యర్థి జట్టుతో పాటు గ్రౌండ్ లో ఉన్నఅభిమానులు కూడా షాక్ అయ్యారు. కొంత సమయం ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి కనిపించింది. 

ఐపీఎల్ 2025 41వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ తలపడుతోంది. ఓపెనర్లు ఇద్దరు సింగిల్ డిజిట్ కే అవుట్ అయి పెవిలియన్ కు చేరారు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇషాన్ కిషన్ తన వికెట్‌ను ప్రత్యర్థికి అప్పనంగా అప్పగించాడు. అవును అవుట్ కాకుండానే వికెట్ తీసుకోండి అంటూ క్రీజును వదిలాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో వచ్చిన బంతిని ఫ్లిక్ చేయబోయి ఎడ్జ్ అయినట్టు అనిపించింది. కానీ అసలు బంతి బ్యాట్‌కు తగలలేదు. ఇషాన్ కిషన్ క్రీజును నుంచి బయటకు వస్తుండటంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు. 

34

ఇక్కడ విచత్రం ఏమిటంటే ముంబై ఆటగాళ్లు అప్పీల్ కూడా చేయలేదు. అంపైర్ వెంటనే అవుట్ ఇవ్వలేదు. అయినా ఇషాన్ తనను ఔట్ అయ్యానని భావించి రివ్యూ తీసుకోకుండా నేరుగా పెవిలియన్ వైపు నడిచాడు. దీంతో అంపైర్ అవుట్ ఇచ్చాడు. 

బ్యాట్ బాల్ తగిలి ఉంటుందని అందరు భావించారు. అందుకే ఇషాన్ కిషన్ క్రీజును వీడాడని ప్రత్యర్థి ఆటగాళ్లు అతడి ఈ స్పోర్ట్స్‌మన్‌షిప్‌ని మెచ్చుకున్నారు. కానీ, రీప్లేలో అతడు నాటౌట్ అని తేలింది. అల్ట్రా ఎడ్జ్‌లో బాల్ బ్యాట్‌ను తాకలేదని స్పష్టంగా కనిపించింది.

44
Ishan Kishan

Ishan Kishan

దీంతో సన్ రైజర్స్ హైదరాబాడ్ టీమ్ తో పాటు అభిమానులు నిరాశగా కనిపించారు.  సోషల్ మీడియాలో పలువురు అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ ఇషాన్ కిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చేశాడు.. ఇదేం ఆటరా?, ఇలా అయితే జట్టు పరిస్థితి ఇంకెంత దిగజారుతుందో అంటూ విమర్శలు  చేస్తున్నారు. కాగా, ఇషాన్ కిషన్ ఈ ఐపీఎల్ ఎడిషన్ లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టాడు. కానీ, ఆ తర్వాత పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved