సన్‌రైజర్స్ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ ప్రకటించిన హెన్రిచ్ క్లాసెన్..
Heinrich Klaasen Retirement: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ వైట్ బాల్ స్పెషలిస్ట్ మంచి గుర్తింపు పొందాడు. కొన్ని నిద్రలేని రాత్రుల తర్వాత తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఎమోషనల్ అయ్యాడు.
Heinrich Klaasen
Heinrich Klaasen Retirement: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం నాలుగు టెస్టు మ్యాచ్ లు ఆడిన తర్వాత టెస్టు ఫార్మట్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
Image credit: PTI
32 ఏళ్ల హెన్రిచ్ క్లాసెన్ జనవరి 8 సోమవారం టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇటీవల భారత్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు అతడిని ఎంపిక చేయకపోవడంతో క్లాసెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.
వన్డే క్రికెట్ లో అత్యుత్తమ మిడిలార్డర్ బ్యాటర్లలో ఒకరైన హెన్రిచ్ క్లాసెన్ నాలుగేళ్లలో కేవలం 4 టెస్టులు మాత్రమే ఆడాడు. 2023 మార్చిలో వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా తరఫున ఆడాడు.
తన టెస్టు కెరీర్ రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ.. 'నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా అని కొన్ని నిద్రలేని రాత్రుల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. ఇది నా ఫేవరెట్ ఫార్మాట్ కాబట్టి నేను తీసుకున్న కఠినమైన నిర్ణయం ఇదే' అని హెన్రిచ్ క్లాసెన్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.
ഹൈദരാബാദിന്റെ രക്ഷകന്
అనుభవజ్ఞుడైన ఫస్ట్ క్లాస్ ఆటగాడు అయిన క్లాసెన్ 85 మ్యాచ్లు ఆడి 46 సగటుతో 5347 పరుగులు చేశాడు. తన కెరీర్లో 12 సెంచరీలు, 24 అర్ధసెంచరీలు సాధించాడు. దక్షిణాఫ్రికాలో చాలా మంది వికెట్ కీపర్ల భిన్నంగా కీపర్ గా, బ్యాటర్ గా మంచి గుర్తింపు సాధించాడు. అయితే, దక్షిణాఫ్రికా అతన్ని పక్కన పెట్టి భారత్ తో సిరీస్ కోసం కైల్ వెరెన్నేను తీసుకుంది.
Heinrich Klaasen
'మైదానంలో, బయట నేను ఎదుర్కొన్న పోరాటాలు నన్ను ఈ రోజు మెరుగైన క్రికెటర్ గా మార్చాయి. ఇది ఒక గొప్ప ప్రయాణం.. నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగినందుకు సంతోషంగా ఉంది. నా దృష్టిలో ఇది నాకు అప్పగించిన అత్యంత విలువైన క్యాప్' అని హెన్రిచ్ క్లాసెన్ పేర్కొన్నాడు. అలాగే, తాను మెరుగైన క్రికెటర్ మారడంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
Heinrich Klaasen
కాగా, ఫిబ్రవరిలో న్యూజిలాండ్ లో దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనకు ఏడుగురు అన్ క్యాప్డ్ ఆటగాళ్లతో కూడిన యువ జట్టును ప్రొటీస్ ప్రకటించింది. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో పలువురిని ఆగ్రహానికి గురిచేసింది. జనవరి 10 నుంచి ప్రారంభం కానున్న టీ20 లీగ్ రెండో ఎడిషన్ ఎస్ఏ20కి సన్నద్ధమవుతున్న క్లాసెన్ సహా బడా స్టార్లు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రొటీస్ బోర్టు ప్రకటించింది.