బీసీసీఐ సారథిగా సౌరవ్ గంగూలీ: మునుపటి దూకుడు కొనసాగేనా..?

First Published 15, Oct 2019, 3:35 PM IST

బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనం కానుంది. ఈ క్రమంలో బోర్డులో భారీగా ప్రక్షాళన ఉంటుందని.. యువకులకు, ప్రతిభావంతులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 

భారత క్రికెట్ నియంత్రణా మండలి అధ్యక్షుడిగా గంగూలీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్. శ్రీనివాసన్ బలపరిచిన బ్రిజేష్ పటేల్ నుంచి గట్టిపోటీ వచ్చినా దేశంలోని మెజార్టీ క్రికెట్ సంఘాలు సౌరవ్‌కే మద్ధతుగా నిలిచాయి. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ బీసీసీఐకి సరికొత్త జవసత్వాలు తీసుకొస్తాడని అతని అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు గంపెడాశలు పెట్టుకున్నారు.

మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం భారత జట్టును ఓ కుదుపు కుదిపింది. ప్రతి ఒక్కరిపైనా అనుమానాలు.. అన్నింటికి మించి దర్యాప్తు సంస్థల నుంచి విచారణలు ఇలా టీమిండియా తీవ్ర సంక్షోభంలో ఉంది. అలాంటి సమయంలో జట్టు పగ్గాలు అందుకున్నాడు దాదా. యువకులకు పెద్దపీట వేసి, బద్ధంగా కదిలే జట్టుకు దూకుడు తత్వాన్ని నేర్పించాడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్, జహీర్, మహేంద్ర సింగ్ ధోని లాంటి మేటీ ప్లేయర్లను దేశానికి అందించాడు.

తీసుకునే నిర్ణయాల్లో, ఆడే ఆటలో దూకుడుతో విదేశాల్లో సైతం భారత జట్టుకు ఎదురులేదని నిరూపించాడు. 2002లో ఇంగ్లాండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్‌ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా విజయం సాధించింది. ఆ వెంటనే స్టాండ్స్‌లో ఉన్న గంగూలీ షర్ట విప్పి చేసిన రచ్చను ఏ క్రికెట్ అభిమాని మరచిపోలేదు. ఆ చర్యతో తన వ్యక్తిత్వం ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు.

2003 ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లి తనెంటో నిరూపించుకుని భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా, స్పూర్తిని నింపే నాయకుడిగా చరిత్ర సృష్టించాడు. టీమిండియాకు ఎందరో కెప్టెన్లుగా వచ్చారు.. పోయారు కానీ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు భారత జట్టు ఎంతో ఎత్తుకు ఎదిగింది.

టీమిండియా కెప్టెన్‌గా నాడు ప్రదర్శించిన నాయకత్వ లక్షణాలే దాదాను ప్రత్యేకంగా నిలిపాయి. 2015లో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గంగూలీని నియమించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అలా మూడుసార్లు రాష్ట్ర క్రికెట్ సంఘానికి సేవలందించాడు. క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే సంస్కరణలను తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. అలా బీసీసీఐ అధ్యక్షుడి రేసులోకి సౌరవ్ చేరారు.

ఈ క్రమంలో పోటీ అన్నది లేకుండానే ఏకగ్రీవంగా అధ్యక్ష పదవిని అలంకరించేందుకు రెడీ అవుతున్న దాదా.. తన జీవితంలో కొత్త ఇన్సింగ్స్‌ను ప్రారంభించబోతున్నాడు. అయితే ప్రస్తుతం బీసీసీఐ సంక్షోభంలో చిక్కుకుంది. గత కొన్నేళ్లుగా బోర్డు రోజువారి కార్యకలాపాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు 2017లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను పదవి నుంచి తప్పించింది.

జస్టిస్ లోథా నేతృత్వంలోని సిఫారసులను అమలు చేసేందుకు వినోద్ రాయ్, విక్రమ్ లిమాయే, డయానా ఎడుల్జీ, రామచంద్ర గుహలతో కూడిన పరిపాలనా కమిటీని నియమించింది. అప్పటి నుంచి బీసీసీఐ కార్యకలాపాలను ఈ కమిటీయే పర్యవేక్షిస్తూ వస్తోంది. ఈ అనిశ్చితిని చక్కదిద్దే సామర్ధ్యం గంగూలీకే ఉందని నిర్ణయించుకున్న అనేక క్రికెట్ సంఘాలు ఆయనకే మద్ధతు ప్రకటించాయి. అందుకు తగ్గట్టుగానే బీసీసీఐని తిరిగి గాడిలో పెట్టడమే తన కర్తవ్యమని తెలిపాడు దాదా.

loader