- Home
- Sports
- Cricket
- దాదా మైండ్ గేమ్ ఆడుతున్నాడు! ఆ మ్యాచ్ కేవలం విరాట్ కోహ్లీ వల్లే గెలిచారు... పాక్ మాజీ క్రికెటర్ కామెంట్స్...
దాదా మైండ్ గేమ్ ఆడుతున్నాడు! ఆ మ్యాచ్ కేవలం విరాట్ కోహ్లీ వల్లే గెలిచారు... పాక్ మాజీ క్రికెటర్ కామెంట్స్...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై హైప్ ఓ రేంజ్‌కి వెళ్లిపోయింది. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరిగే ఈ మ్యాచ్‌కి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే సెకన్ల గ్యాప్‌లో అన్నీ అమ్ముడుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అంతలా డిమాండ్ ఉన్న ఈ మ్యాచ్‌పై గంగూలీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి..

‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి హైప్ చాలా ఉంది. అయితే క్వాలిటీ కూడా ముఖ్యం. వరల్డ్ కప్‌లో మేం పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచులు అన్నీ వన్‌సైడెడ్‌గా గెలిచాం. దుబాయ్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోనే వాళ్లు మొదటిసారి గెలిచారు.. నా వరకూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు సౌరవ్ గంగూలీ..
India vs Pakistan
గంగూలీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బాసిత్ ఆలీ.. ‘సౌరవ్ గంగూలీ స్టేట్‌మెంట్ చదివి నేను షాక్ అయ్యా. గంగూలీ, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్. టాప్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఎంతో మంది కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చి, స్టార్లుగా తయారుచేసిన గొప్ప కెప్టెన్ కూడా..
అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచులన్నీ వన్‌సైడెడ్ అయ్యాయని దాదా చేసిన వ్యాఖ్యలను నేను అంగీకరించను. అవును, మీరు, ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్‌ని చాలాసార్లు ఓడించారు. అయితే 2017 తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది..
India vs Pakistan
యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో మేం ఇండియాని చిత్తుగా ఓడించాం. ఆసియా కప్ టోర్నీలోనూ ఓ మ్యాచ్ గెలిచాం, ఓ మ్యాచ్ ఓడిపోయాం. ముఖ్యంగా మేం ఫైనల్‌కి వెళ్లాం. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా చేతుల్లో ఓడిపోయి ఉండొచ్చు. అయితే అది కేవలం విరాట్ కోహ్లీ వల్లే...
India vs Pakistan
అతను సింగిల్ హ్యాండెడ్‌గా పాకిస్తాన్‌ని ఓడించాడు. ఆ రోజు అతను ఆడింది చరిత్రలో నిలిచిపోయే బెస్ట్ టీ20 ఇన్నింగ్స్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌కి ఎక్కువ మంది జనం వస్తారని దాదా చేసిన కామెంట్స్ నాకు కరెక్ట్ అని అనిపించడం లేదు..
ఒక్కటి చెప్పండి, ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్ ఆడితే మీ రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తాయా? లేదు కదా.. ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే భారత్‌లో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తాయి. పాకిస్తాన్‌లోనూ అంతే. అందరూ టీవీలకు అతుక్కుపోయి, మ్యాచ్ గెలిపించాలని దేవుడిని ప్రార్థిస్తారు.. ఒక్కసారి టికెట్ రేట్లను కూడా చూడు...
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు హోటల్ రేట్లు చూడు ఎలా ఉన్నాయో. అదే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అప్పుడు రేట్లు అలా ఉన్నాయి. కాబట్టి ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ హైప్ వేరు. దాదాజీ కేవలం మైండ్ గేమ్ ఆడి, పాకిస్తాన్ టీమ్‌పై ఒత్తిడి పెంచాలని చూస్తున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బాసిత్ ఆలీ..