- Home
- Sports
- Cricket
- టీమ్ సెలక్షన్ మీటింగ్‌లో గంగూలీకి ఏం పని... మరోసారి దాదా పాలిటిక్స్‌ను టార్గెట్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్...
టీమ్ సెలక్షన్ మీటింగ్‌లో గంగూలీకి ఏం పని... మరోసారి దాదా పాలిటిక్స్‌ను టార్గెట్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్...
టీమిండియా కెప్టెన్‌గా జట్టుపై తనదైన ముద్ర వేసిన సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా తన మార్కు చూపిస్తున్నాడు. అయితే అక్కడ, ఇక్కడ కూడా రాజకీయాల గురించి ఎక్కువ ప్రస్తావన రావడం విశేషం...

టీమిండియా కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ ఉన్న సమయంలో దాదాపు కొన్నేళ్ల పాటు డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయకుండా కొనసాగుతూ వచ్చాడు. సోషల్ మీడియా ప్రభావం లేని ఆ రోజుల్లోనే దాదా బ్యాటింగ్‌ను న్యూడిల్స్ చేయడంతో పోల్చేవాళ్లు క్రికెట్ ఫ్యాన్స్...
ఇప్పుడు భారత క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న సౌరవ్ గంగూలీ, భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రభావాన్ని తగ్గించేందుకు అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అయ్యింది...
వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు గంటన్నర ముందే చెప్పారని విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ తర్వాత కొన్నిరోజులకే అతను టెస్టు కెప్టెన్సీ కూడా వదులుకుంటున్నట్టు ప్రకటించడం జరిగిపోయాయి...
వన్డే కెప్టెన్సీ పోయినందుకు ఫీలైన విరాట్ కోహ్లీ, టెస్టు ఫార్మాట్ పగ్గాలు కూడా వదులుకున్నాడంటే తెర వెనక జరిగిన తతంగాల గురించి క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు...
తాజాగా మరోసారి సౌరవ్ గంగూలీ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీనికి కారణం బీసీసీఐ రాజ్యంగ నియమాలకు విరుద్ధంగా టీమ్ సెలక్షన్ మీటింగ్‌లో ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా పాల్గొంటున్నారని ఓ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలే...
బీసీసీఐ నియమాల ప్రకారం టీమ్ సెలక్షన్ అనేది పూర్తిగా సెలక్టర్లు, కెప్టెన్, హెడ్ కోచ్‌లు కలిసి నిర్ణయించాల్సి ఉంటుంది. టీమ్ సెలక్షన్ పూర్తయిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు, దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది...
అయితే బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మాత్రం సెలక్టర్లను, కెప్టెన్, వైస్ కెప్టెన్లను తన దగ్గరికి పిలిపించుకుని టీమ్ సెలక్షన్ మీటింగ్ నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇది బీసీసీఐ నియామవళికి విరుద్ధం...
భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా ఈ విషయం గురించి బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేశాడు. టీమ్ సెలక్షన్ విషయంలో తమకు ఎలాంటి స్వేచ్చ ఉండదని, సెలక్టర్లు ఎవరిని సెలక్ట్ చేసినా, వారిని ఆడించాల్సి ఉంటుందని కామెంట్ చేశాడు...
తాజాగా బీసీసీఐ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి వచ్చిన టీమ్ సెలక్షన్ మీటింగ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టీమ్ సెలక్షన్ మీటింగ్‌లో గంగూలీ, జై షాలకు ఏం పని అంటూ ప్రశ్నిస్తున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్...
కేంద్ర మంత్రి కొడుకు కావడం వల్లే జై షాను కూడా టీమ్ సెలక్షన్ మీటింగ్‌కి తీసుకెళ్లిన సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిని మాత్రం అనుమతించకపోవడం విచిత్రంగా ఉందంటూ పాత ఫోటోలను రీట్వీట్ చేస్తున్నారు టీమిండియా అభిమానులు...