- Home
- Sports
- Cricket
- సౌరవ్ గంగూలీ లాంటోడే ఇలాంటి కామెంట్లు చేస్తే, కుర్రాళ్ల పరిస్థితి ఏంటి... - సల్మాన్ భట్
సౌరవ్ గంగూలీ లాంటోడే ఇలాంటి కామెంట్లు చేస్తే, కుర్రాళ్ల పరిస్థితి ఏంటి... - సల్మాన్ భట్
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత చేసిన కామెంట్లు పెను సంచలనం క్రియేట్ చేశాయి. ఈ వ్యాఖ్యలపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ స్పందించాడు..

Sourav Ganguly
బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత తిరిగి కామెంటేటర్‌గా మారిన సౌరవ్ గంగూలీ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమి తర్వాత రోహిత్ శర్మను సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేశాడు.
Image credit: PTI
‘రోహిత్ శర్మ కెప్టెన్సీపైన నాకు ఇంకా పూర్తి నమ్మకం ఉంది. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ ఇద్దరూ కూడా ఐదేసి ఐపీఎల్ టైటిల్స్ గెలిచారు. ఐపీఎల్ టైటిల్ గెలవడం అంత సులువైన విషయం కాదు. ఇది చాలా కఠినమైన టోర్నీ...
Sourav Ganguly
నా ఉద్దేశంలో వరల్డ్ కప్ గెలవడం కంటే ఐపీఎల్ టైటిల్ గెలవడం చాలా కష్టం. 14 మ్యాచులు ఆడిన తర్వాత ప్లేఆఫ్స్ ఆడి ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ వరల్డ్ కప్‌లో నాలుగైదు మ్యాచులు ఆడితే ఆ తర్వాత సెమీ ఫైనల్స్, ఫైనల్స్ ఆడితే చాలు..
Rohit Sharma
రోహిత్ శర్మ, ఆసియా కప్ టైటిల్ గెలిచాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక అతనే టీమిండియా కెప్టెన్‌గా బెస్ట్ ఆప్షన్. అతని కెప్టెన్సీలో టీమిండియా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఆడింది..’ అంటూ రోహిత్ శర్మను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశాడు సౌరవ్ గంగూలీ..
Rohit Sharma-Gill
ఈ వ్యాఖ్యలపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తీవ్రంగా స్పందించాడు.. ‘సౌరవ్ గంగూలీ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్, కెప్టెన్... ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడని అస్సలు అనుకోలేదు. లీగ్ క్రికెట్‌ని టెస్టు క్రికెట్‌తో ఎలా పోలుస్తారు...
Image credit: Mumbai Indians
ఐపీఎల్‌లో ఫారిన్ ప్లేయర్లను ఆడించొచ్చు, వాళ్లకు కెప్టెన్సీ కూడా ఇవ్వొచ్చు.. వరల్డ్ కప్ టోర్నీలో అలాంటి ఛాన్సులు ఉండవు, బెస్ట్ టీమ్స్‌తో బెస్ట్ ప్లేయర్లతో ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ టోర్నీలు గెలవడం అంత ఈజీ అయితే టీమిండియా ఎందుకు గెలవలేకపోతోంది..
Image credit: Getty
సౌరవ్ గంగూలీ లాంటి వ్యక్తి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే యంగ్‌స్టర్స్ ఎలా తీసుకుంటారు. వాళ్లు టీమిండియాకి ఆడడాన్ని గర్వంగా ఫీల్ అవుతారా? ఐపీఎల్ ఆడడమే గొప్ప అనుకుంటారా? అసలు ఫ్రాంఛైజీ క్రికెట్‌ని ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పోల్చడమే తప్పు...’ అంటూ కామెంట్ చేశాడు సల్మాన్ భట్..