- Home
- Sports
- Cricket
- కెప్టెన్‌గా టీమిండియా రాతను మార్చిన సౌరవ్ గంగూలీ, కోహ్లీ ఫ్యాన్స్‌కి విలన్‌గా ఎలా మారాడు? దాదా ప్లాన్‌లో...
కెప్టెన్‌గా టీమిండియా రాతను మార్చిన సౌరవ్ గంగూలీ, కోహ్లీ ఫ్యాన్స్‌కి విలన్‌గా ఎలా మారాడు? దాదా ప్లాన్‌లో...
టీమిండియాకి మొదటి వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ కపిల్ దేవ్. అయితే భారత క్రికెట్‌లో అన్యూహ్యా మార్పులు తీసుకొచ్చిన క్రెడిట్ మాత్రం సౌరవ్ గంగూలీకి దక్కాల్సిందే. మహమ్మద్ అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న సమయంలో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు సౌరవ్ గంగూలీ..
మ్యాచ్ ఫిక్సింగ్, బుకీలు, అండర్ వరల్డ్ మాఫియా.. ఇలా భారత క్రికెట్ ప్రపంచంలో నీలినీడలు కమ్ముకున్న సమయంలో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ రాతను మార్చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ తర్వాత క్రికెట్ చూడడం మానేసిన చాలామందిని మళ్లీ స్టేడియాలకు తీసుకురాగలిగాడు..
2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో షర్ట్ విప్పి సెలబ్రేట్ చేసుకున్నాడు సౌరవ్ గంగూలీ. ఈ మూమెంట్ దాదా కెరీర్‌లోనే కాదు, భారత క్రికెట్ చరిత్రలోనే ఓ సంచలనం. అగ్రెషన్, బజ్‌బాల్ వంటి ఫార్ములాలన్నీ గంగూలీ ఎప్పుడో వాడేశాడు..
మ్యాచ్ ఫిక్సింగ్ కాదు కదా, సౌరవ్ గంగూలీతో ఆ విషయం గురించి మాట్లాడాలంటే భయపడేవాళ్లమని ఓ బుకీ, సీబీఐ విచారణలో వెల్లడించాడు. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో అజిత్ అగార్కర్, ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఊతప్ప, మహేంద్ర సింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్, శ్రీశాంత్, జహీర్ ఖాన్.. ఇలా ఎందరో మ్యాచ్ విన్నర్లు టీమిండియా తరుపున ఆడారు..
పేలవ ఫామ్‌తో టీమ్‌లో చోటు కోల్పోయిన సౌరవ్ గంగూలీ, మళ్లీ దేశవాళీ టోర్నీల్లో ఆడి ఫామ్ నిరూపించుకుని... జెట్ స్పీడ్‌తో టీమ్‌లోకి తిరిగి వచ్చాడు. గంగూలీ కమ్‌బ్యాక్ ఎపిసోడ్ గురించే ఓ బయోపిక్ తీసేయొచ్చు..
2003 వన్డే వరల్డ్ కప్‌లో 3 సెంచరీలు చేసిన సౌరవ్ గంగూలీ, ఐసీసీ టోర్నీల్లో మొత్తంగా ఆరు సెంచరీలు చేసి.. అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు. ఇప్పటికీ గంగూలీ రికార్డును ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు..
బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ ఐపీఎల్ 2020 సీజన్‌ని జరిపించి, కోవిడ్ భయంతో భయపడుతూ బతుకుతున్న జనానికి రిలీప్ అందించాడు సౌరవ్ గంగూలీ. కరోనా కేసులతో ఐపీఎల్ 2021 సీజన్‌కి మధ్యలో బ్రేక్ పడితే.. దాన్ని రెండు ఫేజ్‌లుగా జరిపించి పూర్తి చేయించాడు.
అయితే టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత సౌరవ్ గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య వచ్చిన విబేధాలు, దాదాపై తీవ్రమైన ట్రోలింగ్ రావడానికి కారణమైంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ 2017, వన్డే వరల్డ్ కప్ 2019, టీ20 వరల్డ్ కప్ 2021, ఐసీసీ టెస్టు ఛాంపియన్స్ షిప్ ఫైనల్ 2021 టోర్నీల్లో ఓడిపోయింది భారత జట్టు..
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఫెయిల్ అవుతూ వస్తున్న విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్‌గా కరెక్ట్ కాదని భావించాడు సౌరవ్ గంగూలీ. అదీకాకుండా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేతో విరాట్ కోహ్లీ వ్యవహరించిన విధానం, సౌరవ్ గంగూలీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
దీంతో విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు వ్యూహ రచన చేసి, దాన్ని విజయవంతంగా అమలు చేయగలిగాడు కూడా. అయితే కోహ్లీ ప్లేస్‌లో ధోనీయో, లేక రాహుల్ ద్రావిడ్ వంటి కామ్ పర్సన్ ఉండి ఉంటే ఇంత రచ్చ జరిగి ఉండేది కాదు..
Virat Kohli Sourav Ganguly
అగ్రెసివ్ యాటిట్యూడ్, ఓపెన్ మైండ్‌సెట్ ఉన్న విరాట్ కోహ్లీ, తనకు జరిగిన ప్రతీ విషయాన్ని మీడియాకి వెల్లడించడంతో సోషల్ మీడియాలో రచ్చ లేచింది. ఓ రకంగా గంగూలీ చేసింది కోహ్లీ మీద పగతో కాదు. టీమిండియా బాగు కోసమే.. అని దాన్ని కరెక్టుగా అమలు చేయడంలో జరిగిన మిస్ ఫైర్, ఛేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పిన విషయాలు.. గంగూలీని కోహ్లీ ఫ్యాన్స్‌కి విలన్‌గా మార్చేశాయి..