- Home
- Sports
- Cricket
- టీమిండియాని ఓడించడం కాదు, యాషెస్ గెలిస్తే వాళ్ల సత్తా ఏంటో తెలుస్తుంది... రికీ పాంటింగ్ కామెంట్..
టీమిండియాని ఓడించడం కాదు, యాషెస్ గెలిస్తే వాళ్ల సత్తా ఏంటో తెలుస్తుంది... రికీ పాంటింగ్ కామెంట్..
యాషెస్ సిరీస్, ఆ తర్వాత వెస్టిండీస్ టూర్‌లో ఘోర పరాజయాల తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ జో రూట్ తీసుకున్న నిర్ణయం, ఇంగ్లాండ్ జట్టుకి బాగా కలిసి వచ్చింది. బెన్ స్టోక్స్ టెస్టు కెప్టెన్‌గా, బ్రెండన్ మెక్‌కల్లమ్ టెస్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాక వరుస విజయాలతో దూసుకుపోతోంది ఇంగ్లాండ్...

బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో బంతిని బాదడమే టార్గెట్‌గా తీసుకున్న ఇంగ్లాండ్ జట్టు... న్యూజిలాండ్‌ని, టీమిండియాని ఓడించి వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసింది...
భారత జట్టుతో జరిగిన నిర్ణయాత్మక ఐదో టెస్టులో 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించి... టీమిండియాకి షాక్ ఇచ్చింది ఇంగ్లాండ్... ఇంగ్లాండ్ దూకుడుపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...
‘ఇప్పటిదాకా ఇంగ్లాండ్ ఆటతీరు అద్భుతంగా ఉంది. నిజానికి వాళ్లు టెస్టు క్రికెట్‌లో కొత్త జోష్ నింపారు. ఇది కోచింగ్‌లో వచ్చిన మార్పు మాత్రమే కాదు. చాలా మంది ఇంగ్లాండ్ ఆటగాళ్ల యాటిట్యూడ్ కూడా పూర్తిగా మారిపోయింది...
ఓడిపోతామేమోనని భయపడుతూ ఆడకుండా కేవలం పరుగులు చేయడమే లక్ష్యంగా కొడుతున్నారు. ఫీల్డ్‌లో ఇలాంటి అగ్రెషెన్, జట్టులో తెలియని ఎనర్జీని నింపుతుంది. ప్రత్యర్థిని భయపడేలా చేస్తుంది...
Jonny Bairstow-Ben Stokes
అయితే న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లను ఓడించడం కాదు. వచ్చే ఏడాది యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాని ఓడిస్తే... నిజంగా వారి ఆటతీరు మారినట్టు. యాషెస్ సిరీస్ ప్రెషర్‌ని తట్టుకుని, బజ్ బాల్ కాన్సెప్ట్‌ని కొనసాగిస్తే.. హోరాహోరీ పోరు చూసే అవకాశం దొరుకుతుంది...
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచులు తరుచుగా ఉండడం లేదు. ఇప్పుడు ఇరు జట్ల ఆటతీరు ఒకేలా కనిపిస్తోంది. అయితే క్లాస్ విషయంలో మాత్రం చాలా తేడా ఉంది...
Image credit: Getty
ఇంగ్లాండ్ స్వదేశంలో గెలిచిన విజయాలను విదేశాల్లో కొనసాగించగలుగుతుందా? అని వచ్చే నెల వరకూ వేచి చూస్తే కానీ తెలీదు. నా వరకూ 18 నెలల తర్వాత ఇంగ్లాండ్ ఇదే ఆటతీరు కొనసాగిస్తుందా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్..
Ben Stokes
యాషెస్ సిరీస్ 2021-22లో ఐదు మ్యాచుల్లో ఒకే ఒక్క టెస్టును ఒక్క వికెట్ తేడాతో డ్రాగా ముగించుకున్న ఇంగ్లాండ్ జట్టు, మిగిలిన నాలుగు టెస్టుల్లో చిత్తుగా ఓడి 4-0 తేడాతో సిరీస్ కోల్పోయింది..