MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అతనికి మరో 2 ఓవర్లు దక్కి ఉంటే మ్యాచ్ ఫినిష్ చేసేవాడు... రాజస్థాన్ రాయల్స్ ప్రయోగాలపై సెహ్వాగ్ ఫైర్...

అతనికి మరో 2 ఓవర్లు దక్కి ఉంటే మ్యాచ్ ఫినిష్ చేసేవాడు... రాజస్థాన్ రాయల్స్ ప్రయోగాలపై సెహ్వాగ్ ఫైర్...

2022 సీజన్‌లో అంచనాలకు మించి రాణించి ఫైనల్‌కి దూసుకెళ్లింది రాజస్థాన్ రాయల్స్. 2023 సీజన్‌ని కూడా ఘనంగా ప్రారంభించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై భారీ విజయం అందుకున్న రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ పోరాడి ఓడింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 06 2023, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఎవరి ఊహకు అందనట్టుగా యశస్వి జైస్వాల్‌తో రవిచంద్రన్ అశ్విన్‌ని ఓపెనర్‌గా పంపింది రాజస్థాన్ రాయల్స్‌. అయితే ఈ ప్రయోగం సక్సెస్ కాలేదు. 4 బంతులు ఆడిన అశ్విన్ డకౌట్ అయ్యాడు. ఐదో స్థానంలో వచ్చిన దేవ్‌దత్ పడక్కిల్ 26 బంతులు ఆడి ఓ ఫోర్‌తో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

27

సిమ్రాన్ హెట్మయర్‌ వంటి హిట్టర్ టీమ్‌లో ఉన్నా.. అతన్ని కాదని దేవ్‌దత్ పడిక్కల్, రియార్ పరాగ్‌లను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపిన రాజస్థాన్ రాయల్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. 18 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్, ఆఖరి ఓవర్ మూడో బంతికి అవుట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్, 5 పరుగుల తేడాతో ఓడింది..
 

37

‘హెట్మయర్ లాంటి హిట్టర్ టీమ్‌లో ఉన్నప్పుడు అతనికి వీలైనంత త్వరగా బ్యాటింగ్‌కి పంపాలి. 200 స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేసే ప్లేయర్‌ని ఆఖరి ఓవర్లలో క్రీజులోకి పంపితే లాభం ఏంటి? అతను నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది...

47

దేవ్‌దత్ పడిక్కల్, రియాన్ పరాగ్ లాంటి అనుభవం లేని బ్యాటర్ల కంటే సిమ్రాన్ హెట్మయర్‌ బాగా ఆడగలడు. ఆ నమ్మకం కూడా రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌కి లేకపోయిందా? వెస్టిండీస్‌కి అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు..

57

హెట్మయర్ ఇండియాలో సెంచరీ చేశాడు. ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసు. రాజస్థాన్ రాయల్స్ తరుపున గత సీజన్లలో కూడా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున కూడా ఆడాడు. ఢిల్లీ ఫైనల్ చేరడంలో హెట్మయర్ పాత్ర ఎంతో ఉంది...

67
sanju padikkal

sanju padikkal

సిమ్రాన్ హెట్మయర్ లాంటి డేంజరస్ బ్యాటర్‌ని టీమ్‌లో పెట్టుకుని, అతన్ని వాడుకోవడం రాయల్స్‌కి తెలియడం లేదు. టాప్ 4లో ఆడడానికి హెట్మయర్ పనికి రాడని రాయల్స్ టీమ్ మేనేజ్‌మెంట్ అనుకుందా? నా వరకూ హెట్మయర్‌కి మరో రెండు ఓవర్లు దక్కి ఉంటే మ్యాచ్‌ని ఫినిష్ చేసేవాడు...

77

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, కోచ్ కుమార సంగర్కర్ ఈ విషయంలో వ్యూహాత్మక తప్పిదం చేశారు..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
SRH vs PBKS : కూపర్‌ కానెల్లీ సెంచరీ కొట్టినా పంజాబ్ కింగ్స్ ఎందుకు ఓడిపోయింది?
Recommended image2
Mumbai Indians: హార్దిక్ అవుట్.. సూర్య దూరం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మళ్లీ రోహిత్ శర్మ!
Recommended image3
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ ఆట ఆగాల్సిందే! రాజస్థాన్ రాయల్స్‌పై ఎఫ్ఐఆర్.. అసలేం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved