- Home
- Sports
- Cricket
- చిన్నచిన్న తప్పులు, భారీ మూల్యం... కామన్వెల్త్ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి కారణాలివే...
చిన్నచిన్న తప్పులు, భారీ మూల్యం... కామన్వెల్త్ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి కారణాలివే...
కామన్వెల్త్ గేమ్స్ 2022లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో భారత జట్టు అంచనాలకు మించి రాణించింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్ చేరిన భారత మహిళా జట్టు, ఫైనల్‌లో మాత్రం పసిడి పతకాన్ని అందుకోలేకపోయింది. 162 పరుగుల లక్ష్యఛేదనలో 152 పరుగులకి పరిమితమై 9 పరుగుల తేడాతో ఓడింది భారత మహిళా జట్టు...

18 ఓవర్లు ముగిస సమయానికి 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది భారత జట్టు. విజయానికి ఆఖరి 12 బంతుల్లో 17 పరుగులు కావాలి. టీ20ల్లో ఇది పెద్ద కష్టసాధ్యమైన విషయం కూడా ఏమీ కాదు. చేతిలో ఇంకా 4 వికెట్లు ఉండడంతో భారత జట్టు ఈజీగా గెలుస్తుందని భావించారంతా...
ఎంత లేదన్నా ఆఖరి బంతి వరకూ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతందని అనుకున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అయితే ఆఖరి రెండు ఓవర్లలో చేసిన సిల్లీ మిస్టిక్స్‌కి భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది...
ఆఖరి 14 బంతుల్లో 23 పరుగులు కావాల్సిన దశలో భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా... అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యింది. స్నేహ్ రాణా ఆ బంతికి ముందే బౌండరీ కొట్టింది. బౌండరీ తర్వాత కచ్చితంగా పరుగు తీయాల్సిన అవసరం కానీ, బౌండరీ కొట్టాల్సిన అవసరం కానీ లేదు...
cricket
అయితే ఆఖరి ఓవర్ వరకూ మ్యాచ్ వెళితే టెన్షన్ పడాల్సి ఉంటుందని అనవసర ఒత్తిడికి లోనైన స్నేహ్ రాణా... స్ట్రైయిక్ రొటేట్ చేసేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాధా యాదవ్ కూడా ఇదే రకమైన ఒత్తిడికి లోనై, సింగిల్ తీసుకునేందుకు ప్రయత్నించి రనౌట్ అయ్యింది...
cricket
వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా... రెట్టించిన ఉత్సాహంతో దీప్తి శర్మను అవుట్ చేసి... భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌ని విజయవంతంగా పెవిలియన్ చేర్చగలిగింది...
అయినా వికెట్ కీపర్ యషికా భాటియా క్రీజులో ఉండడంతో భారత జట్టుకి ఎక్కడో కొన్ని ఆశలు మిగిలాయి. 19వ ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. అయినా ఆఖరి ఓవర్‌లో 6 బంతుల్లో 11 పరుగులు చేస్తే చాలు. అంటే గట్టిగా రెండు ఫోర్లు బాదితే మ్యాచ్ టర్న్ అయిపోతుంది...
Cricket
అయితే మొదటి బంతికి సింగిల్ తీయని యషికా భాటియా, ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు చేసేందుకు ప్రయత్నించి మేఘనా సింగ్‌ని రనౌట్ చేసింది. నాలుగు బంతుల్లో 10 పరుగులు కావాల్సిన సమయంలో యషికాన ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన జొనాసెన్ మ్యాచ్‌ని ముగించి... ఆసీస్‌కి స్వర్ణం అందించింది...
దీనితో పాటు వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో భారత జట్టు ప్రధాన సీనియర్ వికెట్ కీపర్ తానియా భాటియాకి గాయమైంది. ఈ కారణంగా ఆమె స్థానంలో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా యషికా భాటియా, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి వచ్చింది...
కామన్వెల్త్ గేమ్స్‌లో మొదటిసారిగా బ్యాటింగ్‌కి రావడం, అదీ ఫైనల్ మ్యాచ్‌లో కీలక సమయంలో క్రీజులో అడుగుపెట్టడంతో యషికా భాటియా... తీవ్రమైన ఒత్తిడికి గురై, అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది...
Sneh Rana
టోర్నీలో అద్భుతంగా రాణించిన స్మృతి మంధాన, ఫైనల్‌లో 6 పరుగులకే అవుట్ కావడం, షెఫాలీ వర్మ 11 పరుగులకే పెవిలియన్ చేరడం కూడా భారత జట్టుకి విజయాన్ని దూరం చేశాయి. 65 పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్... కీలక సమయంలో అవుట్ కావడం.. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రాణించకపోవడం భారత జట్టుకి స్వర్ణాన్ని దూరం చేశాయి.