- Home
- Sports
- Cricket
- రింకూ సింగ్‌తో శుబ్‌మన్ గిల్ చెల్లెలి ఢేటింగ్... ఆ ఒక్క కామెంట్‌తో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ...
రింకూ సింగ్‌తో శుబ్‌మన్ గిల్ చెల్లెలి ఢేటింగ్... ఆ ఒక్క కామెంట్‌తో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ...
ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్‌కి కూడా చేరలేకపోయింది. అయితే ఆ జట్టు ఆటగాడు రింకూ సింగ్ మాత్రం సూపర్ డూపర్ ఇన్నింగ్స్‌లతో క్రేజీ స్టార్‌గా మారిపోయాడు...

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది, ఐపీఎల్ చరిత్రలోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్.. 14 మ్యాచుల్లో 474 పరుగులు చేశాడు...
Image credit: PTI
2023 సీజన్‌లో 4 హాఫ్ సెంచరీలు బాదిన రింకూ సింగ్, కేకేఆర్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ నితీశ్ రాణా 413 పరుగులు చేస్తే, వెంకటేశ్ అయ్యర్ 404 పరుగులు చేశారు..
Image credit: PTI
2023 సీజన్‌తో ఒక్కసారిగా రింకూ సింగ్‌కి టీమిండియాలో చోటు దక్కాలనే వాదన విపరీతంగా పెరిగింది. వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కి ప్రకటించే జట్టులో రింకూ సింగ్ పేరు ఉండడం దాదాపు ఖాయమే...
Rinku SIngh
కటిక పేదరికం నుంచి వచ్చిన రింకూ సింగ్, ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత సూపర్ స్టార్‌గా మారిపోయాడు. దీంతో ఐపీఎల్ ముగిసిన తర్వాత మాల్దీవులకు వెళ్లి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ సిక్స్ ప్యాక్‌తో సముద్రంలో జలకాలాడుతున్న ఫోటోలను షేర్ చేశాడు రింకూ సింగ్...
Rinku Singh
ఈ ఫోటోలపై శుబ్‌మన్ గిల్ చెల్లెలు షా నీల్ గిల్ స్పందించిన తీరు హాట్ టాపిక్ అయ్యింది. ‘ఓ... హీరో’ అంటూ ఫ్లాట్ అయిపోయినట్టు ఎమోజీలను జత చేసింది షా నీల్ గిల్..
Image credit: Shahneel Gill/Instagram
ఆర్‌సీబీపై శుబ్‌మన్ గిల్ సెంచరీ చేసి, మ్యాచ్‌ని గెలిపించిన తర్వాత అతని చెల్లి షా నీల్ సోషల్ మీడియా అకౌంట్లపై బూతు కామెంట్లు చేశారు బెంగళూరు ఫ్యాన్స్.. దీంతో వెలుగులోకి వచ్చిన షా నీల్, ఇప్పుడు రింకూ సింగ్ ఫోటోపై కామెంట్ చేసి మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది...
గత రెండు సీజన్లుగా గుజరాత్ టైటాన్స్‌కి ఆడుతున్న శుబ్‌మన్ గిల్, అంతకుముందు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే రింకూకి, గిల్ చెల్లెలికి పరిచయం అయ్యింది...
కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా భార్య సాచి మార్వాతో పాటు ఆండ్రే రస్సెల్ భార్య జాసం లోరా కూడా రింకూ సింగ్ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం..