తిరిగొచ్చిన గిల్.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మారుతుందా?
IND vs AUS : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ కు ముందు శుభ్ మన్ గిల్ బొటనవేలు గాయం నుంచి కోలుకుని నెట్స్ ప్రాక్టీస్ కు తిరిగి వచ్చాడు.
నెట్స్ ప్రాక్టీస్ లో శుభ్ మన్ గిల్
భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శుభ్ మన్ గిల్ శుక్రవారం నెట్స్ ప్రాక్టీస్‌కు తిరిగి వచ్చాడు. పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో బొటనవేలు గాయం కారణంగా అతను ఆడలేకపోయాడు. ప్రస్తుతం, అతను కోలుకుంటున్నట్లు నెట్ ప్రాక్టీస్ తో తెలుస్తోంది. మొదటి టెస్టులో భారీ విజయాన్ని అందుకున్న భారత జట్టు తన కూర్పులో మార్పులు చేస్తుందా? అనేది ఆసక్తిని పెంచుతోంది.
గిల్
గత ఆస్ట్రేలియా పర్యటనలో కీలక పాత్ర పోషించిన శుభ్ మన్ గిల్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన నాలుగు టెస్టు మ్యాచ్ లలో కూడా కీలకంగా వ్యవహరిస్తాడని భావిస్తున్నారు. శనివారం ప్రారంభమయ్యే ప్రైమ్ మినిస్టర్స్ XI vs ఇండియా మధ్య జరిగే పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు గిల్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. భారత ఆటగాళ్లు యశ్ దయాళ్, ఆకాష్ దీప్‌ల బౌలింగ్ ను ఎదుర్కొన్నాడు.
గిల్ మిడిల్ ఆర్డర్ లో ఆడే అవకాశం
పెర్త్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడంతో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడంతో భారత బ్యాటింగ్ లైనప్ మళ్లీ పాతరుపును సంతరించుకుంటుందని భావిస్తున్నారు. యశస్వి జైస్వాల్‌తో కలిసి రోహిత్ మళ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. రాహుల్ అద్భుతమైన ప్రదర్శన గిల్‌కు మిడిల్ ఆర్డర్ స్థానాన్ని దక్కించుకోవడానికి అవకాశం కల్పించింది. జట్టు మేనేజ్‌మెంట్ గిల్‌ను ఐదవ స్థానంలో ఉంచవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి, ఇది అతను సాధారణంగా టాప్-ఆర్డర్‌లో ఆడే స్థానానికి చాలా భిన్నమైనదని చెప్పాలి.
టెస్ట్ క్రికెట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా శుభ్ మన్ గిల్ దూరం అయ్యాడు. దీంతో అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ కు మూడో మూడో నంబర్‌లో ఆడే అవకాశం లభించింది. దీనిని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పెద్దగా స్కోర్ చేయలేదు. ప్రాక్టీస్ మ్యాచ్ బ్యాట్స్‌మెన్‌లందరికీ మిడిల్ ఆర్డర్‌లో ఆడే అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి, మిగిలిన సిరీస్‌లకు సరైన కలయికను కనుగొనడానికి భారత శిబిరం వారి లైనప్‌తో ప్రయోగాలు చేయవచ్చు.