- Home
- Sports
- Cricket
- అతన్ని ఆడించకపోతే టీమిండియాకి కష్టమే! వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీపై హర్భజన్ సింగ్..
అతన్ని ఆడించకపోతే టీమిండియాకి కష్టమే! వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీపై హర్భజన్ సింగ్..
12 ఏళ్ల తర్వాత స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడబోతోంది టీమిండియా. ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా, వన్డే వరల్డ్ కప్ 2023 గెలిచి తీరుతుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు అభిమానులు..

Image credit: Getty
అక్టోబర్ 5న ఆరంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ, నవంబర్ 19న ముగియనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా.. 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్భజన్ సింగ్, టీమిండియాపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..
Image credit: Getty
‘టీమిండియాకి ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా అవసరం. భారత బ్యాటింగ్ భారం ఎక్కువగా రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌లపైనే ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లేదా శ్రేయాస్ అయ్యర్ ఉన్నా... ఓపెనర్లు బాగా ఆడితే ఈజీగా భారీ స్కోర్ చేయొచ్చు..
Image credit: PTI
మరీ ముఖ్యంగా శుబ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇండియాలో అతనికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. శుబ్‌మన్ గిల్‌ని సరిగ్గా వాడుకుంటే టీమిండియాకి వన్డే వరల్డ్ కప్‌లో మ్యాచ్ విన్నర్‌గా మారతాడు...
Image credit: PTI
బౌలింగ్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా కీ బౌలర్. ఐపీఎల్ 2023 సీజన్‌లో అతని బౌలింగ్ చూశాం. 20కి పైగా వికెట్లు తీశాడు. యజ్వేంద్ర చాహాల్ కూడా ఉండాల్సిందే...
Image credit: PTI
ఆస్ట్రేలియా విషయానికి వస్తే కామెరూన్ గ్రీన్ కీ ప్లేయర్. ఎందుకంటే అతను ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇండియాలో ఆడాడు. ఇక్కడ ఎలా ఆడాలో అతనికి ఓ అవగాహన వచ్చి ఉంటుంది. ఐపీఎల్‌లో అతను చేసిన పరుగులు, ఇప్పుడు ఆసీస్‌కి అదనపు ఎనర్జీ..
ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా భారత పరిస్థితులను చక్కగా వాడుకోగలడు. డేవిడ్ వార్నర్, ప్యాట్ కమ్మిన్స్‌లకు భారత పరిస్థితుల గురించి మంచి అవగాహన వచ్చింది. ఈ రెండు జట్లకీ వీళ్లే కీ ప్లేయర్లు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..