MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • శుబ్‌మన్ గిల్‌ని అన్‌ఫాలో చేసిన సారా టెండూల్కర్... ఇద్దరికీ బ్రేకప్ అయిపోయిందంటూ...

శుబ్‌మన్ గిల్‌ని అన్‌ఫాలో చేసిన సారా టెండూల్కర్... ఇద్దరికీ బ్రేకప్ అయిపోయిందంటూ...

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌కీ, భారత యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌కీ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఎప్పుడూ సారా టెండూల్కర్ కానీ, శుబ్‌మన్ గిల్ కానీ స్పందించింది లేదు... అయితే ఈ ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 26 2022, 05:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

శుబ్‌మన్ గిల్ సెంచరీ చేసినా లేక డకౌట్ అయినా అతని కంటే ఎక్కువగా సారా టెండూల్కర్ పేరు ట్రెండింగ్‌లో నిలుస్తుంది. సచిన్ టెండూల్కర్ కాబోయే అల్లుడు అంటూ శుబ్‌మన్ గిల్‌ని తెగ మోసేస్తారు క్రికెట్ ఫ్యాన్స్...

27

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అదిరిపోయే పర్పామెన్స్ ఇచ్చి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన శుబ్‌మన్ గిల్, తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో మొట్టమొదటి వన్డే సెంచరీ నమోదు చేసి.. ఇక్కడ కూడా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు...

37

కెరీర్ పీక్ ఫామ్‌లో దూసుకుపోతున్న శుబ్‌మన్ గిల్‌, సారా టెండూల్కర్‌తో తెగ తెంపులు చేసుకున్నాడట. సెడన్‌గా ఈ వార్తలు రావడానికి కారణం సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో అవ్వడమే. ఇన్‌స్టాగ్రామ్‌లో సారా టెండూల్కర్‌ని శుబ్‌మన్ గిల్, శుబ్‌మన్ గిల్‌ని సారా టెండూల్కర్ అన్‌ఫాలో కొట్టేశారు...

47

కొన్నేళ్ల కిందట సారా టెండూల్కర్ ఫోటోపై శుబ్‌మన్ గిల్ కామెంట్ చేయడం...శుబ్‌మన్ గిల్ ఫోటోలపై సారా పెట్టిన కామెంట్లతో ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే వార్త... సోషల్ మీడియాలో గుప్పుమని వ్యాపించింది. అయితే ఈ ఇద్దరూ ఒకటిగా ఎప్పుడూ కనిపించింది లేదు... 

57

తాజాగా శుబ్‌మన్ గిల్ చేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ‘లాయల్ టు మై ఫ్యూచర్. నాట్ మై పాస్ట్’ అంటూ కొటేషన్ జోడించాడు. గతంలో జరిగినపోయిన దానికి తాను బాధ్యుడిగా కానంటూ గిల్ చేసిన పోస్టు, సారా టెండూల్కర్ గురించేనని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

67

లండన్‌లో మెడిసిన్ విద్యను పూర్తి చేసిన సారా టెండూల్కర్, కొన్నాళ్ల క్రితం మోడలింగ్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పాలరాతి శిల్పంలా మెరిసిపోయే సారా టెండూల్కర్, గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి...

77
Image Credit: Shubman Gill Instagram (L); Sara Tendulkar Instagram (R)

Image Credit: Shubman Gill Instagram (L); Sara Tendulkar Instagram (R)

సారా టెండూల్కర్ కంటే శుబ్‌మన్ గిల్ వయసులో ఏడాది చిన్నవాడు కావడం విశేషం. అయితే ప్రేమకు, పెళ్లికి వయసుతో సంబంధం లేదని సచిన్ టెండూల్కర్ - అంజలి నిరూపించారు. సారా కూడా వారి దారిలో నడుస్తుందని వార్తలు వచ్చాయి. అంతలోనే ఈ ఇద్దరూ అన్‌ఫాలో అవ్వడంతో ‘బ్రేకప్’ వార్త... సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Unbreakable Cricket Records: 27 సిక్సర్లు, 30 ఫోర్లు.. ఒకే టీ20 ఇన్నింగ్స్ లో 344 రన్స్.. వరల్డ్ రికార్డ్ షేక్!
Recommended image2
PBKS Vs RR: 15 ఏళ్ల బుడ్డోడి చేతుల్లో 3 జట్ల భవితవ్యం.. ఓడితే ఇక అస్సామే.. వివరాలు ఇవిగో
Recommended image3
RCB : ఇదెక్కడి మాస్‌రా మావా.. 75 పరుగులకే ఢిల్లీ ఫినిష్.. 9000 పరుగులతో కోహ్లీ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved