శ్రేయాస్ అయ్యర్ దూరమైనా టీమిండియాకి ఊరట... రెండో వన్డేలో బరిలో దిగుతున్న...
రెండో వన్డేలో ఏకంగా ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్ గాయపడడంతో టీమిండియా అభిమానుల్లో కలవరం మొదలైంది. అసలే వన్డే సిరీస్‌లో పెద్దగా బ్యాట్స్‌మెన్లకి చోటు కల్పించలేదు. ఉన్న కొద్దిమందిలో ఇద్దరు గాయపడడంతో మిగిలిన రెండు వన్డేల్లో కష్టమే అని కలవరపడ్డారు...

ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయాస్ అయ్యర్ ఎముక పక్కకు జరగడంతో అతను వన్డే సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో కూడా సగం మ్యాచులకు దూరం కానున్నాడు శ్రేయాస్ అయ్యర్...

మొదటి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ అందరూ ముకుమ్మడిగా ఫెయిల్ అయిన చోట, అద్భుత హాఫ్ సెంచరీతో టీమిండియా ఓ మాదిరి స్కోరు అయినా చేయడంలో కీలక పాత్ర పోషించాడు శ్రేయాస్ అయ్యర్...

అయితే సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ తర్వాత అయ్యర్‌కి పెద్దగా పర్ఫామ్ చేయడానికి అవకాశం రాలేదు. మొదటి వన్డేలో కూడా బ్యాటింగ్‌లో 6 పరుగులే చేసి అవుట్ అయ్యాడు అయ్యర్...

అలాగే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మార్క్ వుడ్ బౌలింగ్‌లో గాయపడిన రోహిత్ శర్మ, ఫీల్డింగ్‌కి రాలేదు. అతని స్థానంలో శుబ్‌మన్ గిల్ ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు..

మార్క్ వుడ్ బౌలింగ్‌లో గాయపడి, రక్తం కారుతున్నా ఫిజియో చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు రోహిత్ శర్మ. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత రోహిత్ శర్మ గాయాన్ని పరీక్షించిన వైద్యలు, ఫ్యాక్చర్ కాలేదని తేల్చారు...

రోహిత్ గాయం పెద్దగా తీవ్రమైనది కాదని తేల్చడంతో శుక్రవారం జరిగే రెండో వన్డేలో బరిలో దిగబోతున్నాడు ‘హిట్ మ్యాన్’... అయ్యర్ లేకపోయినా రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సాధించడం టీమిండియాకు కలిసొచ్చే అంశమే..

మరోవైపు మొదటి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్... గాయాల తీవ్రత ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఇద్దరూ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి వచ్చారు. ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ అయితే చేతికి నాలుగు కుట్లు పడినా బ్యాటింగ్ చేశాడు. రెండో వన్డేలో ఈ ఇద్దరూ ఆడతారా? లేదా తెలియాల్సి ఉంది...

ఇప్పటికే స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా వన్డే సిరీస్‌కి దూరం కావడంతో ఇబ్బంది పడుతున్న ఇంగ్లాండ్, మోర్గాన్, సామ్ బిల్లింగ్స్ కూడా దూరమైన మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది...