షాకింగ్ న్యూస్.. టెస్టు క్రికెట్ కు షమీ వీడ్కోలు తీసుకోబోతున్నాడా?
Mohammed Shami: 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత గాయం కారణంగా మహ్మద్ షమీ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన మ్యాచ్ లలో ఆడుతాడనుకుంటున్న సమయంలో ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.

Mohammed Shami
Mohammed Shami: భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ త్వరలోనే ఆస్ట్రేలియాకు వెళ్తాడనే వార్తలు వచ్చాయి. అయితే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే షమీ టెస్టు క్రికెట్ కు దూరం కానున్నాడనే షాకింగ్ వార్తలు వస్తున్నాయి. అంటే సిరీస్ ఆడాలా? లేదా? అనే నిర్ణయం ఇప్పుడు పూర్తిగా షమీపైనే ఆధారపడి ఉంటుందని విశ్వసిస్తున్నారు.
Mohammed Shami
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్న షమీ
అయితే వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ల కోసం షమీ 100% ఫిట్‌గా ఉండేందుకు సిద్ధమవుతాడు. ఫాస్ట్ బౌలర్ ఈ సంవత్సరం ప్రారంభంలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత రంజీ ట్రోఫీతో ఒక నెల క్రితం దేశీయ క్రికెట్‌లో తిరిగి వచ్చాడు.
ప్రస్తుతం షమీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. దేశీయ ఆటలలో పూర్తి ఫిట్‌నెస్‌ను కొనసాగించాడు. దీంతో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉండటానికి సిద్ధమవుతున్నాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి. భారత జట్టు మేనేజ్‌మెంట్ కూడా షమీ పునరాగమనం గురించి చాలా జాగ్రత్తగా ఉంది. అతనిని గ్రౌండ్ లోకి దించడానికి హడావిడి చేయడం కూడా ఇష్టం లేదు.
Mohammed Shami , shami
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో షమీ ఎంట్రీకి హడావిడి లేదు
మహ్మద్ షమీ శస్త్రచికిత్స నుండి తిరిగి కోలుకున్న తర్వాత రంజీ ట్రోఫీతో గ్రౌండ్ లోకి దిగాడు. రంజీ మ్యాచ్ లతో పాటు ఎనిమిది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. అయితే, తాను ప్రస్తుతం టెస్టు క్రికెట్ పూర్తిగా సరిపోతాడని బీసీసీఐ భావించడం లేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తనను తాను హడావిడి చేయకుండా ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐపీఎల్ 2025 కోసం షమీ తనను తాను ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నాలు ఉన్నాయని సంబంధిత రిపోర్టులు వెల్లడించాయి. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం 10 కోట్ల రూపాయలకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Mohammed Shami
మహ్మద్ షమీని ఇబ్బంది పెడుతున్న వాపు
మహ్మద్ షమీ రంజీ, ముస్తక్ అలీ ట్రోఫీలో కొన్ని మ్యాచ్ లను ఆడినప్పటికీ ఇంకా అతని ప్రస్తుత ఫిట్‌నెస్ ఆందోళనకరంగానే ఉందని సమాచారం. వాపు ఇప్పటికీ అతనిని కలవరపెడుతోందనీ, టెస్టులకు అందుబాటులో ఉండే ముందు మరిన్ని దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లను ఆడాలని కోరుకుంటున్నట్లు బీసీసీఐ పేర్కొంది.
"వాపు వచ్చి పోతుంది. అతను మరింత ఎక్కువగా దేశీయ క్రికెట్ ఆడటానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. అందువల్ల అతను బెంగాల్ తరఫున డిసెంబర్ 21 నుండి విజయ్ హజారే ట్రోఫీని మరోసారి ఆడే అవకాశముంది" అని బీసీసీఐ తెలిపింది.
Mohammed Shami
ఆస్ట్రేలియాలో ఆడడం మహ్మద్ షమీకి పెద్ద రిస్క్
ఆస్ట్రేలియన్ మైదానాల్లో ఆడటం షమీకి ప్రస్తుతం పెద్ద ప్రమాదమనీ, అది అతని మోకాలిపై ప్రభావాన్ని చూపుతుందనీ, ఇదే సమయంలో అతను ఐపీఎల్ లో ఆడటానికి తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టవచ్చని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని కోసం అతను టెస్టు క్రికెట్ కు దూరంగా ఉండే అవకాశముందని ప్రస్తావిస్తున్నాయి. ఇదే సమయంలో వన్డే, టీ20 క్రికెట్ పై దృష్టి పెట్టనున్నట్టు చెబుతున్నాయి. మరి రాబోయే ఐసీసీ టోర్నమెంట్స్ తర్వాత షమీ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడా? లేదో చూడాలి.