- Home
- Sports
- Cricket
- శార్దూల్ ఠాకూర్, జయ్‌దేవ్ ఉనద్కట్, ముకేశ్ కుమార్... వరల్డ్ కప్‌లో ఆ ఒక్క ప్లేస్ కోసం ముగ్గురి మధ్య పోటీ
శార్దూల్ ఠాకూర్, జయ్‌దేవ్ ఉనద్కట్, ముకేశ్ కుమార్... వరల్డ్ కప్‌లో ఆ ఒక్క ప్లేస్ కోసం ముగ్గురి మధ్య పోటీ
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి రెండు నెలల ముందే ప్రాథమిక జట్టును ప్రకటించేసింది ఆస్ట్రేలియా. అయితే ఈ నెలలో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023 టోర్నీకి కూడా ఇప్పటిదాకా జట్టును ప్రకటించలేదు బీసీసీఐ. ఆసియా కప్ ఆడే టీమ్, 99 శాతం వన్డే వరల్డ్ కప్‌లోనూ ఆడనుంది..

India vs West Indies
సెప్టెంబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి టీమ్‌ని ప్రకటించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 27లోగా టీమ్స్ అన్నీ, ప్రపంచ కప్ ఆడే జట్టులో అవసరమైన మార్పులు, చేర్పులు చేసి ఐసీసీకి తెలియచేయాల్సి ఉంటుంది...
వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఆసియా కప్ 2023 టోర్నీకి జట్టును ప్రకటించనుంది బీసీసీఐ. ఆసియా కప్ 2023, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమ్ పర్ఫామెన్స్‌ని బట్టి... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి జట్టును ఎంపిక చేయబోతున్నారు..
శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి టాపార్డర్‌లో ఉండడం గ్యారెంటీ. అలాగే స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా.. ఫాస్ట్ బౌలర్లుగా మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా ఉండడం ఖాయం..
మిగిలిన ప్లేసుల కోసం తీవ్రమైన పోటీ జరుగుతోంది. శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోతే సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లకు మిడిల్ ఆర్డర్‌లో చోటు దక్కుతుంది. అలాగే నాలుగో ఫాస్ట్ బౌలర్‌గా ముగ్గురి మధ్య పోటీ నడుస్తోంది..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ స్వదేశంలో జరుగుతుండడంతో ఇద్దరు లేదా ముగ్గురు స్పిన్నర్లు తుది జట్టులో ఉంటారు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు లేదా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు మాత్రమే తుది జట్టులో చోటు దక్కతుుంది. మహ్మద్ సిరాజ్, షమీ, జస్ప్రిత్ బుమ్రా ఈ లిస్టులో ఉంటారు..
Mukesh Kumar
నాలుగో పేసర్ కోసం శార్దూల్ ఠాకూర్, జయ్‌దేవ్ ఉనద్కట్‌తో పాటు ముకేశ్ కుమార్‌ని కూడా పరిశీలిస్తున్నారట సెలక్టర్లు. జయ్‌దేవ్ ఉనద్కట్, దేశవాళీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అయితే టీమిండియా తరుపున మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు..
వెస్టిండీస్ టూర్‌లో కూడా జయ్‌దేవ్ ఉనద్కట్ నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాలేదు. మరోవైపు శార్దూల్ ఠాకూర్, వన్డే సిరీస్‌లో 8 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగలగడం శార్దూల్‌కి ఉన్న అతి పెద్ద అడ్వాంటేజ్..
Image credit: Getty
అర్ష్‌దీప్ సింగ్‌ని ఆసియా క్రీడల కోసం చైనాకి పంపిస్తోంది బీసీసీఐ. దీంతో అతనికి ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో చోటు దక్కదు. దీంతో లేటెస్ట్ సెన్సేషన్ ముకేశ్ కుమార్ కూడా నాలుగో పేసర్ రేసులో నిలిచాడు. అయితే శార్దూల్, జయ్‌దేవ్‌ని కాదని ముకేశ్‌ని సెలక్ట్ చేస్తే, విమర్శలు రావడం ఖాయం..