- Home
- Sports
- Cricket
- షారుక్ కూతురుని పడేసిన రింకూ సింగ్.. నమ్మలేకపోతున్నానంటూ సుహానా ఖాన్ పోస్ట్! పఠాన్ స్టిల్‌తో...
షారుక్ కూతురుని పడేసిన రింకూ సింగ్.. నమ్మలేకపోతున్నానంటూ సుహానా ఖాన్ పోస్ట్! పఠాన్ స్టిల్‌తో...
ఐపీఎల్ 2023 సీజన్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్‌గా నిలిచింది గుజరాత్ టైటాన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య ఆదివార జరిగిన నైల్ బైటింగ్ థ్రిల్లర్. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్, సంచలన విజయం అందుకుంది...

వీర కొట్టుడు, మాస్ కొట్టుడు, దంచి కొట్టుడు... అంతకుమించి ఏదైనా ఉంటే ఆ రేంజ్‌లో ఆఖరి 7 బంతుల్లో 6 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 40 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చి పడేశాడు రింకూ సింగ్. ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ వంటి డేంజరస్ బ్యాటర్లను వెంటవెంటనే అవుట్ చేసి హ్యాట్రిక్ తీసిన రషీద్ ఖాన్, మ్యాచ్‌ని ములుపు తిప్పాడు...
Image credit: PTI
ఇక గెలిచేశాం అని రిలాక్స్ అయ్యారు టైటాన్స్. ఆఖరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావాలి. ఆండ్రే రస్సెల్ వంటి అరవీర భయంకర్ హిట్టర్ కూడా చేయలేనంత టార్గెట్. ఒక్క అంతర్జాతీయ అనుభవం కూడా లేని రింకూ సింగ్ వల్ల అవుతుందా? కేకేఆర్ డగౌట్ కూడా మ్యాచ్ ఓడిపోయామని ఫిక్స్ అయిపోయింది...
Rinku Singh
అయితే ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాది, మాన్‌స్టర్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌కి అద్భుత విజయాన్ని అందించాడు రింకూ సింగ్.. ఒకటి, రెండూ, మూడు, నాలుగు, ఐదు.. ఒకదాని వెనక ఒకటి సిక్సర్లు వెళ్తూ ఉంటే చూస్తూ ఉండిపోయారు గుజరాత్ టైటాన్స్ ఫీల్డర్లు...
ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన లక్ష్యఛేదనలో ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాదిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు రింకూ సింగ్. ఆఖరి ఓవర్‌లో రాబట్టిన అత్యధిక పరుగులు ఇవే. రింకూ సింగ్ ఇన్నింగ్స్‌కి కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖానా ఫుల్లుగా ఇంప్రెస్ అయిపోయింది..
‘నమ్మలేకపోతున్నా... ఇది Unreal!!!’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది సుహానా ఖాన్. కోల్‌కత్తాలో జరిగిన కేకేఆర్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్‌కి తండ్రి షారుక్ ఖాన్, స్నేహితురాలు శనయా కపూర్‌తో కలిసి హాజరైంది సుహానా ఖాన్...
Image: Twitter
షారుక్ ఖాన్ కూడా రింకూ సింగ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌కి ఫిదా అయిపోయాడు. ‘జూమే జో రింకూ.. మై బేబీ రింకూ, నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ అదరగొట్టారు. ఇలాగే దూసుకుపోండి.. కంగ్రాట్స్ కేకేఆర్.. ’ అంటూ పఠాన్ పోస్టర్‌లో రింకూ సింగ్ ఫోటోని జోడించి పోస్ట్ చేశారు షారుక్ ఖాన్. దీనికి స్పందించిన రింకూ సింగ్, ‘షారుక్ సర్ యార్... లవ్ యూ సర్ అండ్ మీ సపోర్ట్‌కి థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు..