ఇద్దరికీ రెస్ట్, ఏడుగురికి బెడ్ రెస్ట్... ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు కావాలనే?...
ఐపీఎల్... ప్రపంచానికి ఏం చేసిందో తెలీదు కానీ భారత జట్టుకి ఎందరో టాలెంటెడ్ క్రికెటర్లను అందించింది. అయితే ఐపీఎల్ కారణంగానే చాలామంది ప్లేయర్లు, గాయాలతో కీలక టోర్నీలకు దూరమయ్యారు...

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ మ్యాచులను టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు నిర్వహించడం వల్లే బాగా అలసిపోయామని స్వయంగా భారత క్రికెటర్లే కామెంట్ చేశారు...
ఐపీఎల్ 2022 సీజన్ అయితే ఏకంగా రెండున్నర నెలల పాటు సాగనుంది. మార్చి 26 నుంచి మొదలై, మే 29 వరకూ నిరవధికంగా జరిగే ఈ మెగా టోర్నీకి ముందు కీలక ఆటగాళ్లు గాయపడడం విశేషం...
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో గాయపడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, గాయం నుంచి కోలుకోవడానికి మూడున్నర నెలల సమయం పట్టింది...
కెఎల్ రాహుల్ కూడా రోహిత్ శర్మనే ఫాలో అవుతూ ఫిట్‌నెస్‌పై ఏ మాత్రం ఫోకస్ పెట్టడం లేదు. గాయంతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కి దూరమైన కెఎల్ రాహుల్, ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌లో పాల్గొన్నాడు. అయితే మళ్లీ విండీస్ టూర్‌లో గాయపడ్డాడు...
కెఎల్ రాహుల్ గాయాలతో సగం మ్యాచులకు దూరం అవుతుండడం... అదే సమయంలో వేరే ఈవెంట్లలో ప్రత్యేక్షం అవుతుండడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌కి మాజీ సారథి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌లకి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. నిజానికి గత ఏడాదిగా పర్ఫెక్ట్‌గా ఫిట్‌నెస్ మెయింటైన్, జట్టుకి పూర్తిగా అందుబాటులో ఉంటోంది ఈ ఇద్దరే...
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకి విరాట్ కోహ్లీ వెన్నునొప్పి వంకతో దూరంగా ఉన్నా, టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న అతను... కావాలనే ఆ మ్యాచ్ ఆడలేదనేది చాలామందికి తెలిసిన విషయమే...
అప్పుడెప్పుడో కరోనా బారిన పడిన స్పిన్నర్ అక్షర్ పటేల్, దాని నుంచి కోలుకున్నా... ఫిట్‌నెస్‌ని సాధించలేక విండీస్‌తో సిరీస్‌కి దూరమయ్యాడు...
ఇంగ్లాండ్ టూర్‌కి ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడి దాదాపు ఆరు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పరిస్థితి కూడా దాదాపు ఇదే...
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడిన సుందర్, గాయపడి టీ20 సిరీస్‌కి దూరమయ్యాడు. ఇప్పుడు శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కి అందుబాటులో లేని సుందర్, టెస్టు సిరీస్ సమయానికైనా కోలుకుంటాడా? అనేది చూడాలి...
ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న సమయంలో దీపక్ చాహార్‌ని గాయాలు వెంటాడుతున్నాయి. విండీస్‌తో టీ20 మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ తొడ కండరాలు పట్టేయడంతో ఓవర్ ఫినిష్ చేయకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కి చేరుకున్నాడు దీపక్ చాహార్...
తొడ కండరాల గాయం నుంచి కోలుకోవడానికి తీవ్రతను బట్టి మూడు వారాల నుంచి 8 వారాల వరకూ సమయం పడుతుంది. దీపక్ చాహార్ గాయంతో ఐపీఎల్ 2022 సీజన్‌కి కూడా దూరమవుతాడని సమాచారం...
నాలుగో స్థానంలో పర్ఫెక్ట్ బ్యాటర్‌గా సెటిలైన సూర్యకుమార్ యాదవ్, విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ‘మ్యాన్ ఆఫ్ సిరీస్’ గెలిచాడు...
అయితే శ్రీలంకతో టీ20 సిరీస్‌కి ముందు సూర్యకుమార్ యాదవ్ గాయంతో తప్పుకున్నాడు. యాదవ్ ఎంట్రీ, టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్... ఈ అవకాశాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుంటున్నాడు...
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ విన్నర్, ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీల్లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్‌కి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు భారతజట్టు...
విండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో ఆడిన రుతురాజ్‌ను శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఆడించాలని అనుకున్నా, అతను గాయపడి జట్టుకి దూరమయ్యాడు...
టెస్టు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా గాయపడి, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టెస్టు సిరీస్ సమయానికి అశ్విన్ కోలుకుంటాడా? అనేది అనుమానంగా మారింది...
ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా గాయపడిన భారత ఆటగాళ్ల లిస్టులో చేరాడు. లంకతో జరిగిన రెండో టీ20లో ఇషాన్ కిషన్ హెల్మెట్‌కి బంతి బలంగా తగిలింది... అతను ఐపీఎల్ సమయానికి కోలుకునే అవకాశం ఉంది...
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. గాయంతో ఐపీఎల్ 2020, ఆస్ట్రేలియా టూర్‌లకి దూరంగా ఉన్న రోహిత్, సౌతాఫ్రికా టూర్ ముందు గాయపడి ఫ్లైట్ ఎక్కనేలేదు...
భారత జట్టులో ఏకంగా 7 ప్లేయర్లు గాయపడి, టీమ్‌కి దూరంగా ఉండడంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఐపీఎల్ మెగా సీజన్ ఆరంభానికి ముందు ఆటగాళ్లు గాయం పేరుతో జట్టుకి దూరంగా ఉండడంతో ఏదో జరుగుతోందని అనుమానిస్తున్నారు.