- Home
- Sports
- Cricket
- సెలక్టర్లు అందరూ కలిసినా విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచుల్లో సగం కూడా ఆడలేదు... మాజీ సెలక్టర్ కామెంట్...
సెలక్టర్లు అందరూ కలిసినా విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచుల్లో సగం కూడా ఆడలేదు... మాజీ సెలక్టర్ కామెంట్...
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై రేగిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. టీ20 కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటూ విరాట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించిన వారే, ఇప్పుడు సెలక్టర్ల తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు...

విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...
తాజాగా భారత మాజీ క్రికెటర్, మాజీ సెక్టర్ కిర్తి అజాద్ కూడా విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాడు...
‘ఒకవేళ ఇది కేవలం సెలక్టర్ల నిర్ణయమే అయితే, దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే ముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వద్దకి వెళ్లి, ఆయన్ని సంప్రదించాల్సిందే...
సాధారణంగా ఓ టూర్‌కి జట్టును ఎంపిక చేసినప్పుడు, ప్లేయర్లను సెలక్ట్ చేసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడికి దగ్గరికి వెళ్లి ఎవరెవరికి ఎంపిక చేసింది? ఎందుకు ఎంపిక చేసింది? వివరించేవాళ్లం...
ఆ ఎంపిక చేసిన జట్టును ఆయన చూసి, దానిని అంగీకరిస్తూ సంతకం పెడితేనే, టీమ్‌ను ప్రకటించేవాళ్లం. జట్టును ఎంపిక చేసిన తర్వాత సెలక్టర్లు, అధ్యక్షుడి అభిప్రాయం తీసుకోవడం సంప్రదాయంగా వస్తోంది...
అలాగే ఏదైనా ఫార్మాట్‌కి కెప్టెన్‌ని మార్చాలని సెలక్టర్లు భావిస్తే, దానికి బీససీఐ అధ్యక్షుడి అనుమతి తప్పనిసరి.
విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో చేసిన కామెంట్లను చూస్తే, అతను వన్డే కెప్టెన్సీ పోయినందుకు అప్‌సెట్ అయినట్టు కనిపించలేదు...
అయితే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించినట్టు చెప్పిన విధానానికి బాగా హార్ట్ అయినట్టు అనిపించింద. ఒకవేళ సౌరవ్ గంగూలీ దగ్గరికి ఈ విషయం వెళ్లి ఉంటే, ఆయన కోహ్లీతో మాట్లాడి ఉండేవాడు...
నేను ఇలా చెప్పాలని అనుకోవడం లేదు కానీ, ఇప్పుడు సెలక్షన్ కమిటీలో ఉన్న సెలక్టర్లు అందరూ కలిసినా విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచుల్లో సగం కూడా ఆడలేదు. కనీసం అతని అనుభవానికైనా కనీస గౌరవం ఇవ్వాల్సింది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ సెలక్టర్ కిర్తి అజాద్...