- Home
- Sports
- Cricket
- సర్ఫరాజ్ ఖాన్ ఎప్పుడూ అలా చేయలేదు... అయినా డ్రెస్సింగ్ రూమ్‌కి వేలు చూపించడం కూడా తప్పేనా!
సర్ఫరాజ్ ఖాన్ ఎప్పుడూ అలా చేయలేదు... అయినా డ్రెస్సింగ్ రూమ్‌కి వేలు చూపించడం కూడా తప్పేనా!
గత మూడు సీజన్లుగా రంజీ ట్రోఫీలో రికార్డు లెవెల్ పర్ఫామెన్స్ ఇస్తూ టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. ఆల్‌టైం గ్రెటెస్ట్ బ్యాటర్ సర్ డాన్ బ్రాడ్‌మన్ ఫస్ట్ క్లాస్ సగటుకి దగ్గరగా ఉన్న సర్ఫరాజ్ ఖాన్, సెలక్టర్ల పిలుపుకి మాత్రం అందనంత దూరంలో ఉన్నాడు..

Sarfaraz Khan
రంజీల్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కి, టీమిండియా నుంచి పిలుపు రాకపోవడానికి అతని దూకుడైన ప్రవర్తన, ఆవేశమే కారణమని ఓ బీసీసీఐ అధికారి కామెంట్ చేసినట్టు వార్తలు వచ్చాయి..
Sarfaraz Khan-Chetan Sharma
‘రంజీ మ్యాచుల్లో సెంచరీ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న బీసీసీఐ చీఫ్ సెలక్టర్ (మాజీ) చేతన్ శర్మ వైపు వేలు చూపిస్తూ సర్ఫరాజ్ ఖాన్ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది టీమిండియా మేనేజ్‌మెంట్‌కి కోపాన్ని తెప్పించింది..
sarfaraz khan
ఆటగాడిగా ఎంత పరిణతి వచ్చినా సర్ఫరాజ్ ఖాన్‌కి మానసిక పరిణతి, ఓపిక రాలేదని సెలక్టర్లు భావిస్తున్నారు. అంతేకాకుండా రంజీల్లో సెంచరీ చేసిన తర్వాత తొడ కొట్టి సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదని మేనేజ్‌మెంట్ అనుకుంటోంది. అందుకే అతనికి అవకాశం దక్కడం లేదు’ అంటూ ఓ బీసీసీఐ అధికారి, మీడియాతో వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి..
తాజాగా ముంబై క్రికెట్ టీమ్, ఈ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చింది. ‘ఢిల్లీలో సర్ఫరాజ్ ఖాన్ సెలబ్రేషన్స్ ఎవరినీ ఉద్దేశించి కాదు. తన టీమ్ మేట్స్‌కి, తన కోచ్ అమోల్ ముజుందర్‌కి... అక్కడికి ఛేతన్ శర్మ వచ్చింది కూడా లేదు. సెలక్టర్ సలీల్ అంకోలా ఒక్కడే వచ్చాడు..
సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చే సమయానికి టీమ్ కష్టాల్లో ఉంది. అందుకే సెంచరీ చేసి, టీమ్‌కి ఒడ్డున పడేశాననే రిలీఫ్‌తో అలా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే అలా సెలబ్రేట్ చేసుకుంటే తప్పేంటి? సొంత డ్రెస్సింగ్ రూమ్‌వైపు వేలు చూపిస్తూ కూడా తప్పేనా...
Sarfaraz Khan
అతను ఎవ్వరినీ తిట్టలేదు, ఎవ్వరితో గొడవ పడలేదు. కోచ్ చంద్రకాంత్ పండిత్‌కి సర్ఫరాజ్ ఖాన్ యాటిట్యూడ్ నచ్చలేదని రాశారు. అసల చందూ సర్‌కీ, సర్ఫరాజ్ ఖాన్‌కి మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిదో తెలుసా.. ఆయన సర్ఫరాజ్‌ని కొడుకులా చూసుకుంటాడు..
Sarfaraz Khan
సర్ఫరాజ్ ఖాన్ గురించి మంచే చెబుతాడు కానీ చెడు చెప్పడు. ఎందుకంటే అతన్ని 14 ఏళ్లు ఉన్నప్పటి నుంచి చూస్తున్నాడు. సర్ఫరాజ్ ఖాన్‌పై ఆయనకి ఎందుకు కోపం వస్తుంది. టీమ్‌కి ఆడడానికి 16.5 ఫిట్‌నెస్ ఉంటే సరిపోతుంది..
సర్ఫరాజ్ ఖాన్ ఆ ఫిట్‌నెస్ లెవెల్స్‌ని ఎప్పుడో సాధించాడు. రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసేందుకు కావాల్సిన ఫిట్‌నెస్, మరో మూడు ఫీల్డింగ్ చేసేందుకు అవసరమైన స్టామినీ అన్నీ అతని దగ్గర ఉన్నాయి. ఇంకేం కావాలి..’ అంటూ ముంబై క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, మీడియాతో వెల్లడించారు..