- Home
- Sports
- Cricket
- పృథ్వీ ‘షాక్’లు.. తన ప్రైవేట్ పార్ట్స్ తాకాడని ఆరోపించిన గిల్.. కేసు నమోదుచేయాలని కోర్టుకు విన్నపం..
పృథ్వీ ‘షాక్’లు.. తన ప్రైవేట్ పార్ట్స్ తాకాడని ఆరోపించిన గిల్.. కేసు నమోదుచేయాలని కోర్టుకు విన్నపం..
Prithvi Shaw: టీమిండియా ఆటగాడు, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న పృథ్వీ షా కు వరుస షాకులు తాకుతున్నాయి.

అసలు భారత క్రికెట్ లో మళ్లీ ఛాన్స్ వస్తుందా..? రాదా..? అనుకుంటున్న తరుణంలో జనవరిలో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో జాతీయ జట్టులోకి అవకాశం దక్కించుకుని ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఉన్న పృథ్వీ షా కు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది.
ఐపీఎల్ - 16పై భారీ అంచనాలతో బరిలోకి దిగిన పృథ్వీ.. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. ఈ క్రమంలో అతడికి మరో షాక్ తగిలింది. రెండు నెలల క్రితం బోజ్‌పురి నటి సప్నా గిల్ తో సెల్ఫీ వివాదంలో ఇరుక్కున్న షా పై కేసు నమోదు చేయాలని ఆమె కోర్టును ఆశ్రయించింది.
ఈ మేరకు సప్నా గిల్.. పృథ్వీ షాను అరెస్టు చేసేందుకు గాను ఆదేశాలు ఇవ్వాలని ముంబై కోర్టును కోరింది. షా తనపై దాడి చేయడమే కాకుండా తన ప్రైవేట్ పార్ట్స్ తాకాడని, తనపై అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన కేసులో గతంలోనే అరెస్టైన సప్నా గిల్.. ఇటీవలే బెయిల్ పై విడుదలైంది.
తాజాగా ఆమె కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో .. తనతో పాటు వచ్చిన ఠాకూర్ టీనేజర్ అని.. సెల్ఫీ అడిగినందుకు వెళ్లిన తమపై పృథ్వీ స్నేహితుల బృందం దాడి చేశారని పేర్కొంది. ఠాకూర్ పై దాడికి దిగినందుకే తాను సర్దిచెప్పేందుకు మధ్యలోకి వెళ్లానని.. ఈ క్రమంలో షా తనను అసభ్యకరంగా తాకాడని, దురుసుగా ప్రవర్తించాడని తీవ్ర ఆరోపణలు చేసింది.
పృథ్వీతో పాటు పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని సప్నా గిల్ తన ఫిర్యాదులో పేర్కొంది. పృథ్వీ పై కేసు నమోదు చేయడంలో ఎయిర్ పోర్ట్ పోలీసులు సరిగా విధులు నిర్వర్తించలేదని.. పోలీసులు సరిగా స్పందించకపోవడంతోనే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు ఫిర్యాదులో తెలిపింది.
కాగా ఈ వివాదం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనింగ్ క్యాంప్ లో చేరిన పృథ్వీ.. ఢిల్లీ తరఫున ఆడిన రెండు మ్యాచ్ లలోనూ విఫలమయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో 12 పరుగులు చేసి ఔటైన షా.. రెండ్రోజుల క్రితం గుజరాత్ తో మ్యాచ్ లో కూడా 7 పరుగులే చేసి నిష్క్రమించాడు. గత సీజన్ లో అద్భుత ఆరంభాలను ఇచ్చిన షా ఈ ఏడాది మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.