పంత్, ధోనీలకు షాకిచ్చిన సంజూ శాంసన్
Sanju Samson shocked Pant and Dhoni : T20I లలో ఓపెనర్‌గా తన కొత్త పాత్రలోకి వచ్చిన భారత వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ 50 బంతుల్లో 107 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ తో దక్షిణాఫ్రికాపై టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే సంజూ పలు కొత్త రికార్డులు నమోదుచేశాడు.
sanju dhoni pant
Sanju Samson shocked Pant and Dhoni: టీ20 సిరీస్ లో భాగంగా భారత జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు టీ20 సిరీస్‌ను అద్భుతంగా ప్రారంభించింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 61 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది.
ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్ విజయంలో సంజూ శాంసన్ సెంచరీ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. కేవలం 50 బంతుల్లోనే 107 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ తన ఇన్నింగ్స్‌లో ఎన్నో పెద్ద రికార్డులు సృష్టించాడు.
Sanju Samson, India, cricket
సెంచరీ ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లు బాదిన సంజూ శాంసన్
సూపర్ సెంచరీతో సంజూ శాంసన్ భారత జట్టు విజయలో కీలక పాత్ర పోషించాడు. శాంసన్ ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. భారతదేశం తరపున అంతర్జాతీయ T20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ రికార్డును కూడా సమం చేశాడు. 22 డిసెంబర్ 2017న ఇండోర్‌లో శ్రీలంకపై 118 పరుగుల ఇన్నింగ్స్‌లో రోహిత్ 10 సిక్సర్లు బాదాడు. శాంసన్ అద్భుత ప్రదర్శనతో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
ఆ తర్వాత భారత బౌలర్లు కూడా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో ఎక్కువ సేపు నిలబడనీయలేదు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు పడగొట్టి టీమ్ ఇండియా విజయంలో స్పీడ్ పెంచారు. అవేశ్ ఖాన్ 2 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్ 1 వికెట్ తీశారు.
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
సంజూ శాంసన్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. అక్టోబర్ 12న హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై 111 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన భారత్ తరఫున తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
వరుసగా రెండు సెంచరీల ఓవరాల్ రికార్డును పరిశీలిస్తే ప్రపంచంలో ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. అతని కంటే ముందు ఫ్రాన్స్‌కు చెందిన గుస్టావ్ మాకన్ 2022లో, దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రూసో, ఇంగ్లండ్‌కు చెందిన ఫిలిప్ సాల్ట్ 2023లో ఈ రికార్డును సాధించారు.
Sanju Samson
సూర్యకుమార్ రికార్డును బద్దలు కొట్టిన సంజూ శాంసన్
ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీగా ఇది నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు సాధించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డును సంజూ బద్దలు కొట్టాడు.
2023 డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై సూర్యకుమార్ 55 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు సంజూ శాంసన్ తన కెప్టెన్‌ను అధిగమించాడు. 47 బంతుల్లోనే సెంచరీ బాదాడు.
రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీల రికార్డును బ్రేక్ చేసిన సంజూ శాంసన్
ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ భారత స్టార్ వికెట్ కీపర్లు రిషబ్ పంత్, ఎంఎస్ ధోనిల రికార్డులు బద్దలు కొట్టారు. టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక ఇన్నింగ్స్‌లలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. అతను మూడోసారి 50+ పరుగులు చేశాడు.
రిషబ్ పంత్ 54 ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు, మహేంద్ర సింగ్ ధోనీ 85 ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు ఈ ఘనత సాధించారు. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌లను సమం చేశాడు. రాహుల్ 8 ఇన్నింగ్స్‌ల్లో 3 సార్లు 50+, ఇషాన్ కిషన్ 16 ఇన్నింగ్స్‌ల్లో 3 సార్లు 50+ స్కోరు చేశారు.