MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • అయ్యో పాపం.. మ్యాచ్ చూడ్డానికి వ‌స్తే అభిమాని త‌ల‌ప‌గ‌ల‌కొట్టిన సంజూ శాంస‌న్

అయ్యో పాపం.. మ్యాచ్ చూడ్డానికి వ‌స్తే అభిమాని త‌ల‌ప‌గ‌ల‌కొట్టిన సంజూ శాంస‌న్

Sanju  Samson's Monster Six: ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన నాల్గో మ్యాచ్ లో సంజూ శాంస‌న్, తిల‌క్ వ‌ర్మ‌లు త‌మ బ్యాట్ విశ్వ‌రూపం చూపించారు. ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం  కూరిపిస్తూ గ్రౌండ్ ను హోరెత్తించారు. ఈ క్ర‌మంలోనే మ్యాచ్ చూడ్డానికి వచ్చిన అభిమాని త‌ల‌ప‌గ‌ల‌కొట్టేశాడు సంజూ శాంస‌న్. అస‌లు ఏం జ‌రిగిందంటే?   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 16 2024, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sanju Samson

Sanju Samson

Sanju  Samson's Monster Six: సంజూ శాంస‌న్.. భార‌త క్రికెట్ లో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాడు. వ‌రుస‌గా భారీ ఇన్నింగ్స్ ల‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు. ఈ ఏడాదిలో మూడు టీ20 సెంచ‌రీలు బాదిన ఏకైక బ్యాట‌ర్ గా ఘ‌న‌త సాధించాడు. టీ20 క్రికెట్ లో వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు బాది అరుదైన రికార్డు న‌మోదుచేశాడు. భార‌త్-సౌతాఫ్రికా టీ20 సిరీస్ తొలి మ్యాచ్ లో అద్భుత‌మైన బ్యాటింగ్ తో సెంచ‌రీ బాదిన సంజూ.. చివ‌రి, 4వ మ్యాచ్ లో కూడా దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సంజూ దెబ్బకు దిమ్మదిరిగిపోయింది..

క్రీజులోకి వచ్చిన తర్వాత భారీ ఇన్నింగ్స్ లు ఆడటం లేదా సున్నా వద్ద అవుట్ అవడం.. ఇది గత కొన్ని ఇన్నింగ్స్ లుగా సంజూ శాంస‌న్ ఆట‌తీరు. గత ఐదు మ్యాచ్‌ల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈ స‌మ‌యంలో సంజూ 3 సెంచరీలు చేశాడు. అదే సమయంలోరెండుసార్లు ఖాతా కూడా తెరవలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 4 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో శతకం బాదిన అతను వరుసగా 2 మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ అద్భుత బ్యాటింగ్ తో జోహన్నెస్‌బర్గ్‌లో సూప‌ర్ సెంచరీ సాధించాడు. ఈ క్ర‌మంలోనే మ్యాచ్ చూడ్డానికి వ‌స్తే అభిమాని త‌ల‌ప‌గ‌ల‌కొట్టేశాడు సంజూ శాంస‌న్. అస‌లు ఏం జ‌రిగిందంటే? 

35
Sanju Samson

Sanju Samson

టీమిండియా సూప‌ర్ బ్యాటింగ్ 

ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓపెనర్లిద్దరూ టీమ్‌ఇండియాకు శుభారంభం అందించారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను ధ్వంసం చేశారు. 18 బంతుల్లో 36 పరుగులు చేసి అభిషేక్ అవుటయ్యే సమయానికి టీమిండియా స్కోరు 5.5 ఓవర్లలో 73 పరుగులు. ఇక్కడి నుంచి తిలక్ వర్మతో కలిసి శాంసన్ బీభత్సం సృష్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 86 బంతుల్లో 210 పరుగుల అజేయ  రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సంజు 56 బంతుల్లో 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, తిలక్ 47 బంతుల్లో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

45

శాంసన్ భారీ సిక్స‌ర్.. ప‌గిలిన‌ అభిమాని త‌ల

భారీ సిక్స‌ర్లు కొట్టడంలో ప్రసిద్ధి చెందిన సంజూ శాంస‌న్.. ఈ మ్యాచ్‌లోనూ 9 సిక్సర్లు బాదాడు. మైదానం చుట్టూ భారీ షాట్లు కొట్టాడు. ఈ సమయంలోనే మ్యాచ్ చూడ‌టానికి వ‌చ్చిన ఒక అభిమాని త‌ల ప‌గ‌ల‌కొట్టాడు. స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న ఓ మహిళా అభిమాని సంజూ కొట్టిన  భారీ సిక్స్‌కు గాయపడింది. ఒక ఓవ‌ర్ లో స్టబ్స్ వేసిన తొలి బంతికే సంజూ భారీ సిక్స‌ర్ కొట్టాడు. తర్వాత రెండో బంతికే శాంసన్ మరోసారి బ్యాట్ ఝుళిపించాడు. అయితే ఈ బంతి మైదానం వెలుపలికి వెళ్లి ఓ మహిళా అభిమానిని తాకింది. దీంతో మహిళా అభిమాని అరుస్తూ, ఏడుస్తూ కనిపించింది. ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

 

55
sanju samson

sanju samson

క్రికెట్ మైదానంలో ఓ అభిమాని బంతికి గాయపడడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు డజన్ల కొద్దీ ఘ‌ట‌న‌లు ఇలాంటివి జ‌రిగాయి. వెంటనే మహిళా అభిమానికి సంజూ శాంసన్ క్షమాపణలు చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌ నుంచి శాంసన్‌ అద్భుతమైన స్టైల్ లో సిక్స‌ర్లు బాదుతున్నాడు. జూలైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 110 మీటర్ల సిక్స్‌తో సంచలనం సృష్టించాడు. సంజూ దెబ్బ‌కు బంతి స్టేడియం బ‌య‌ట ప‌డింది. ఇక ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ 110 మీటర్ల భారీ సిక్సర్ కొట్టి సంచలనం సృష్టించాడు. వరుణ్ చక్రవర్తి వేసిన ఓవ‌ర్ లో ఈ భారీ సిక్స‌ర్ బాదాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved