3 టోర్నీలు, 31 మంది ప్లేయర్లు... అయినా సంజూ శాంసన్‌కి ఒక్క దాంట్లో కూడా దక్కని చోటు...
టీమిండియాలో బ్యాడ్ లక్ బాగా ఉన్న ప్లేయర్ ఎవ్వరైనా ఉన్నారంటే అది సంజూ శాంసనే. అప్పుడెప్పుడో 2015లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, 8 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఆడింది 28 మ్యాచులే...
Sanju Samson
రెండేళ్ల క్రితం అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ టీమ్‌లో స్టార్ ప్లేయర్లుగా మారిపోయి, 50 అంతర్జాతీయ మ్యాచులు ఆడిస్తే.. సంజూ మాత్రం ఏ ప్లేయర్ గాయపడతాడా? ఎవరికి రిప్లేస్‌మెంట్ అవుతానా? అంటూ ఎదురుచూడాల్సిన పరిస్థితి..
Sanju Samson
ప్రస్తుతం ఆసియా కప్ 2023 టోర్నీ ఆడుతున్న టీమిండయా, ఆ తర్వాత ఆసియా క్రీడలకు మరో జట్టును పంపించబోతోంది. అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడనుంది. ఈ మూడు టోర్నీల్లో కలిపి భారత జట్టు తరుపున 31 ప్లేయర్లు ఆడబోతున్నాయి. అయితే ఈ లిస్టులో కూడా సంజూ శాంసన్ చోటు దక్కించుకోలేకపోవడం విశేషం..
ఆసియా కప్ 2023 టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన సంజూ శాంసన్, 2023 వన్డే వరల్డ్ కప్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లలో ఎవరైనా గాయపడితే.. వారి ప్లేస్‌లో ఆడించేందుకు వీలుగా సంజూ శాంసన్‌ని ఆసియా క్రీడలకు కూడా పంపించడం లేదు బీసీసీఐ..
Sanju Samson
వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కి కూడా వన్డే వరల్డ్ కప్‌లో చోటు ఇచ్చిన సెలక్టర్లు, సంజూ శాంసన్‌పై మాత్రం కనికరం చూపించలేదు. టీ20ల్లో ఫెయిల్ అవుతున్నాడనే ఉద్దేశంతో వన్డే ఫార్మాట్ నుంచి దూరం చేశారు సెలక్టర్లు..
Sanju Samson
వన్డేల్లో 26 సగటుతో పరుగులు చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ మాత్రమే కాదు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి వికెట్ కీపర్లుగా ఎంపికైన కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ కంటే సంజూ శాంసన్ వన్డే సగటు చాలా మెరుగ్గా ఉంది..
2021 నుంచి కెఎల్ రాహుల్ 18 వన్డేలు ఆడి, 43.60 సగటుతో 654 పరుగులు చేశాడు. రాహుల్ స్ట్రైయిక్ రేటు 83.95 మాత్రమే. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ 17 వన్డేలు ఆడి 48.5 సగటుతో 776 పరుగులు చేశాడు. ఇషాన్ స్ట్రైయిక్ రేటు 106.74...
2021 నుంచి 12 వన్డేలు ఆడిన సంజూ శాంసన్, 55.71 సగటుతో 390 పరుగులు చేశాడు. వన్డేల్లో సంజూ స్ట్రైయిక్ రేటు 104.0గా ఉంది.
కెఎల్ రాహుల్ కంటే బెటర్ స్ట్రైయిక్ రేటు, ఇషాన్ కిషన్ కంటే బెటర్ యావరేజ్ ఉన్నా సంజూ శాంసన్‌కి కూసింత అదృష్టం కలిసి రాక ప్రపంచ కప్‌కి ఎంపిక కాలేకపోయాడని అంటున్నారు అతని అభిమానులు..