రిషబ్ పంత్‌లో ఉన్నది ఈ ఇద్దరిలో కనిపించదు... సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లపై...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీ తర్వాత టీమిండియాకి మూడు ఫార్మాట్లలో వికెట్ కీపర్‌గా మారిపోయాడు రిషబ్ పంత్. ఆడపాదడపా మ్యాచుల్లో దినేశ్ కార్తీక్ ఆడుతున్నా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ లాంటి యంగ్ వికెట్ కీపర్లు సెకండ్ స్ట్రింగ్ మ్యాచులకే పరిమితమయ్యారు. తాజాగా మాజీ వికెట్ కీపర్ సబా కరీం ఈ ఇద్దరిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు...

Rishabh Pant-Rohit Sharma
మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇవ్వడానికి ముందే మూడు ఫార్మాట్లలో రిషబ్ పంత్‌కి వరుసగా అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ వచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్... టెస్టుల్లో వృద్ధిమాన్ సాహా, వన్డే, టీ20ల్లో కెఎల్ రాహుల్ కొంతకాలం వికెట్ కీపర్లుగా వ్యవహరించినా.. పంత్ వారి ప్లేస్‌లను కబ్జా చేసేశాడు...
Sanju Samson and Rishabh Pant
‘నా ఉద్దేశంలో రిషబ్ పంత్ ఎప్పుడూ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ కంటే ముందు వరుసలో ఉంటాడు. ఎందుకంటే రిషబ్ పంత్‌లో కనిపించే ఆ ఎక్స్ ఫ్యాక్టర్... నా ఈ ఇద్దరిలో కనిపించలేదు..
సంజూ శాంసన్ చాలా చక్కని స్ట్రోక్ మేకర్. ఎలాంటి బంతినైనా బౌండరీ అవతలకి చేర్చగలడు. ఇషాన్ కిషన్‌కి చాలా అవకాశాలే వచ్చాయి, అయితే వాటిని అతను సరిగ్గా వాడుకోలేకపోయాడు. అందుకే ఇప్పుడు అతను టీమ్‌లో చోటు కోల్పోయాడు...
ishan kishan
ఇషాన్ కిషన్ ఫెయిల్యూర్ కారణంగా రిషబ్ పంత్ టీమిండియాకి ప్రధాన వికెట్ కీపర్‌గా మారిపోయాడు. సెలక్టర్లు ఈ ప్లేయర్లను వికెట్ కీపింగ్ బ్యాటర్లుగా చూడడం లేదు. కేవలం పూర్తి స్థాయి బ్యాటర్లుగానే చూస్తున్నారు. వికెట్ కీపింగ్ చేయడమనేది బోనస్ మాత్రమే...
Shreyas and Sanju
సంజూ శాంసన్ తిరిగి భారత జట్టులో చోటు సంపాదించుకున్నా అతనికి బ్యాటర్‌గానే ప్లేస్ దక్కుతుంది కానీ వికెట్ కీపర్‌గా కాదు. ఈ మధ్యకాలంలో సంజూ శాంసన్ బాగా ఆడుతున్నాడు. గత ఏడాది ఐపీఎల్ తర్వాత అతని ఆటలో మార్పు వచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం...