MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆ మ్యాచ్ ఓడిన తర్వాత ధోనీ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా చిన్నపిల్లల్లా ఏడిచారు! - సంజయ్ భంగర్

ఆ మ్యాచ్ ఓడిన తర్వాత ధోనీ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా చిన్నపిల్లల్లా ఏడిచారు! - సంజయ్ భంగర్

రనౌట్‌తో అంతర్జాతీయ కెరీర్‌ని మొదలెట్టిన మహేంద్ర సింగ్, రనౌట్‌తోనే తన ఇంటర్నేషనల్ కెరీర్‌కి ముగింపు పలికాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడింది..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 22 2023, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాపార్డర్ వైఫల్యంతో 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా కూడా ఫెయిల్ అయ్యారు. రవీంద్ర జడేజా- ధోనీ కలిసి ఏడో వికెట్‌కి 116 పరుగులు జోడించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Dhoni Run Out

Dhoni Run Out

టీమిండియా విజయానికి 10 బంతుల్లో 25 పరుగుల కావాల్సిన సమయంలో ధోనీ రనౌట్ అయ్యాడు.. 77 పరుగులు చేసిన రవీంద్ర జడేజా అవుటైన కాసేపటికే ధోనీ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత భువీ, చాహాల్ వికెట్లు కోల్పోయిన టీమిండియా... విజయానికి 18 పరుగుల దూరంలో ఆగిపోయింది..

35

‘2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా లీగ్ స్టేజీలో అద్భుతంగా ఆడింది. 7 మ్యాచులు గెలిచి టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్‌కి వచ్చాం. అయితే సెమీ ఫైనల్ ఓటమి, టీమిండియాకి హార్ట్ బ్రేక్‌ మూమెంట్..

45

సెమీ ఫైనల్‌లో ఓటమి తర్వాత ప్లేయర్లు చాలా మంది చిన్న పిల్లల్లా ఏడిచారు. ధోనీ, దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ కూడా అతన్ని పట్టుకొని ఏడ్చేశారు. ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్ అంతా నిశ్శబ్దమే..

55

ఆ మూడ్ నుంచి ప్లేయర్లు బయటపడడానికి చాలా కాలమే పట్టింది.  ధోనీకి సరైన వీడ్కోలు ఇవ్వలేకపోయామనే బాధ, చాలా ప్లేయర్లలో నిండిపోయింది...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ భంగర్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs WI: విండీస్‌తో భారత్ తొలి వన్డే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖాతాలో బిగ్ రికార్డులు
Recommended image2
IND vs WI: 2027 వన్డే వరల్డ్ కప్ వేట షురూ.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన టీమిండియా
Recommended image3
Viral Video: విధి ఎంత విచిత్రమైందో.. ఒకప్పుడు స్టార్ క్రికెటర్, ప్రస్తుతం దారుణ పరిస్థితి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved