సిక్స్ ప్యాక్ లుక్‌లో షాకిచ్చిన అర్జున్ టెండూల్కర్... క్రికెటర్‌గా సక్సెస్ కాకపోయినా...
ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేశాడు అర్జున్ టెండూల్కర్. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కొడుకుని 2021 సీజన్‌లోనే కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, గత రెండు సీజన్లలో అతన్ని ఆడించకుండా రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది..
Arjun Tendulkar
ఐపీఎల్ 2023 సీజన్‌లో జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ ఇద్దరూ గాయంతో టీమ్‌కి దూరం కావడంతో అర్జున్ టెండూల్కర్‌కి అవకాశం దక్కింది. నాలుగు మ్యాచులు ఆడిన అర్జున్ టెండూల్కర్, 3 వికెట్లు పడగొట్టాడు..
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 31 పరుగులు సమర్పించిన అర్జున్ టెండూల్కర్, సీజన్ మధ్యలో కుక్క కరవడంతో చాలా మ్యాచులకు దూరంగా ఉన్నాడు..
Arjun Tendulkar-Sachin Tendulkar
ఐపీఎల్ 2023 సీజన్‌లో పెద్దగా ఇంప్రెస్ చేయకపోయినా సచిన్ టెండూల్కర్ వారసుడు కావడంతో వచ్చే సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్, అర్జున్ టెండూల్కర్‌ని రిటైన్ చేసుకోవడం గ్యారెంటీ...
దేశవాళీ టోర్నీల్లో ముంబై తరుపున పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయిన అర్జున్ టెండూల్కర్, ఇదే ఏడాది గోవా జట్టుకి మారి.. రంజీల్లో సెంచరీ కూడా చేశాడు. ఎమర్జింగ్ ఆసియా కప్ కోసం 20 రోజుల పాటు ఎన్‌సీఏ క్యాంపులో పాల్గొన్నాడు అర్జున్ టెండూల్కర్..
దియెదర్ ట్రోఫీలో అర్జున్ టెండూల్కర్, మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో సౌత్ జోన్ తరుపున ఆడుతున్నాడు. ఈ సిరీస్‌లో ఆకట్టుకుంటే అర్జున్ టెండూల్కర్‌కి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావచ్చు..
తాజాగా సిక్స్ ప్యాక్ లుక్‌ని రివిల్ చేసి క్రికెట్ ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేశాడు అర్జున్ టెండూల్కర్.. ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభంలో పొట్టతో కనిపించిన అర్జున్, ఫిట్‌నెస్‌పై చాలా శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తోంది..
ఈ ఫిట్‌నెస్, అర్జున్ టెండూల్కర్ క్రికెట్ గేమ్‌కి పెద్దగా ఉపయోగినా, ఉపయోగపోయినా... సచిన్ టెండూల్కర్ వారసుడు కావడంతో మోడలింగ్‌లో అడుగుపెడితే మంచి అవకాశాలు దక్కించుకోవచ్చని అంటున్నారు నెటిజన్లు..
అర్జున్ టెండూల్కర్ అక్క సారా టెండూల్కర్, లండన్‌లో మెడిసిన్ చదివి.. ప్రస్తుతం మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నెలలో ఎక్కువ రోజులు విదేశాల్లో వెకేషన్స్ ఎంజాయ్ చేసే సారా టెండూల్కర్, తన ట్రావెలింగ్ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది..