- Home
- Sports
- Cricket
- ఆ టైంలో సచిన్ టెండూల్కర్ దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చిన అంజలి... తనకంటే ఆరేళ్లు పెద్దదైన ఆమెను...
ఆ టైంలో సచిన్ టెండూల్కర్ దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చిన అంజలి... తనకంటే ఆరేళ్లు పెద్దదైన ఆమెను...
భారత సంప్రదాయం ప్రకారం భర్త కంటే భార్య చిన్నవయసుదై ఉండాలి. అయితే క్రికెట్ వరల్డ్‌లో ఎన్నో రికార్డులు తిరగరాసిన సచిన్ టెండూల్కర్, ఈ రూల్‌ని కూడా తిరగరాసి ఎందరో ప్రేమజంటలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. వరల్డ్ క్రికెట్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదిగిన సచిన్ టెండూల్కర్, తనకంటే ఆరేళ్లు పెద్దదైన అంజలిని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. సచిన్ టెండూల్కర్ ప్రేమ విహహం అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలా పెద్ద విషయమే...

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌లో సచిన్ టెండూల్కర్‌ను చూసిన అంజలి, అతని లుక్స్‌కి పడిపోయి, వెంటపడి మరీ... ప్రేమించి పెళ్లాడింది...
24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 100 సెంచరీలతో 34,357 అంతర్జాతీయ పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, 1995లో తన కంటే వయసులో ఆరేళ్లు పెద్దదైన అంజలిని పెళ్లిచేసుకున్నాడు...
1990లో సచిన్ టెండూల్కర్, అంజలి మెహతాలకు పరిచయమైంది. ఐదేళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు సచిన్, అంజలి...
‘1994లో మేం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాం. అక్లాండ్‌లో మంచి ఇన్నింగ్స్ తర్వాత, వెల్లింగ్టన్‌లోనూ బ్యాటుతో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాను...
ఆ రెండు పర్ఫామెన్స్‌ల కారణంగా నేను మంచి మూడ్‌లో ఉండడం చూసి, అంజలి కరెక్ట్ టైమ్‌లో నా దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చింది...
‘ఇక ఎంగేజ్‌మెంట్ చేసుకుందామా’ అని అడిగింది అంజలి, నేను వెంటనే మంచి మూడ్‌లో ఉండడంతో రెఢీగా ఉన్నా అని చెప్పాను...
అయితే మనం పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మీ అమ్మనాన్నలతో మాట్లాడాలి, నేను మా ఇంట్లో చెబుతాను... అంది అంజలి...
నేను ‘సారీ’ చెప్పేశా... నువ్వే ఇద్దరి ఇళ్లల్లో మాట్లాడాలి. ఈ విషయంలో నువ్వే ఛార్జ్ తీసుకోవాలి. నేను ఇంటికి వెళ్లి, మా అమ్మనాన్నలతో పెళ్లి గురించి మాట్లాడలేను...
కాబట్టి నువ్వు మీ ఇంట్లో చెప్పి, మా ఇంట్లోవాళ్లని ఒప్పించు... అని చెప్పేశా. అంజలి గురించి అప్పటికే మా ఇంట్లో తెలుసు. తను అప్పుడప్పుడూ ఇంటికి వస్తూ ఉండేది...
అయితే పెళ్లి గురించి చెప్పాలంటే ఎందుకో తెలీదు చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకే నువ్వు రెండు పక్కలా ఒప్పిస్తే, రేపు ఎంగేజ్‌మెంట్ చేసుకోవడానికి కూడా నేను రెఢీ... అని చెప్పేశాను...
తనే బాధ్యత తీసుకుని మా ఇంట్లో, వాళ్ల ఇంట్లో చెప్పింది. వాళ్లు కూడా ముందే తెలిసినట్టుగా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు...’ అంటూ 1995లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు క్రికెట్ ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్...
27 ఏళ్లుగా సచిన్ టెండూల్కర్, అంజలి వైవాహిక జీవితం సజావుగా సాగుతోంది. వీరికి సారా టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు...