షాకింగ్ లుక్‌లో సారా టెండూల్కర్... అలా ఉండేదాన్ని, ఇలా అయ్యానంటూ మేకప్ లేకుండా...
భారత మాజీ క్రికెటర్, ‘భారత రత్న’ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నాయి. దీనికి కారణం ముట్టుకుంటే కందిపోతుందేమో అనేలా పాలమీడగలా మెరిసిపోయే ఆమె అందమే... అయితే ఆ అందాల మెరుపుల వెనకున్న రహస్యాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది సారా...

మిల్కీ బ్యూటీలో మెరిసిపోయే సారా టెండూల్కర్, అప్పుడప్పుడూ హాట్ లుక్స్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది... ఇదే ఆమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది...
సచిన్ కూతురిగా కంటే సొంతంగా ఐడెంటిటీ ఏర్పరచుకోవడానికి ఇష్టపడే సారా టెండూల్కర్, ఈ మధ్యే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. త్వరలో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఆరంగ్రేటం చేయబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది...
అయితే ఆమె మెరుపులు నిజం కాదట. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియచేసింది సారా టెండూల్కర్. 10 ఏళ్ల క్రితం టీనేజ్ వయసులో మొటిమలతో ఇలా ఉండేదాన్నంటూ పాత ఫోటోలను పోస్టు చేసింది...
ముఖం నిండి మొటిమలతో జిడ్డు మొహంతో ఉన్న సారా టెండూల్కర్ లుక్‌ని చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఇంత ధైర్యంగా తన పాత ఫోటోలను షేర్ చేసిన సారా, నెటిజన్ల మనసు గెలుచుకుంది...
10 ఏళ్లుగా మెడిసిన్స్‌తో పాటు తరుచూ చర్మసంరక్షణ కోసం చర్యలు తీసుకుంటూ, పక్కా డైట్ ఫాలో అవుతూ మొటిమలు లేని చర్మాన్ని పొందానంటూ ప్రస్తుత ఫోటోను పోల్చి చెప్పింది సారా టెండూల్కర్...
మేకప్ లేని ఫోటోలను షేర్ చేయడానికి ఇష్టపడకుండా, రంగుల ప్రపంచంలో బతికే కొందరు హీరోయిన్ల కంటే నా నిజం ఇది... అంటూ తన లుక్‌ని రివిల్ చేసిన సారా టెండూల్కర్‌ని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు...
సారా టెండుల్కర్ కొన్నాళ్లుగా క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌తో ప్రేమాయణం నడిపిస్తోందని ప్రచారం జరిగింది. ఈ విషయంపై అటు సారా కానీ, ఇటు గిల్ కానీ స్పందించలేదు..