సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ డే... క్రికెట్ దేవుడు సృష్టించిన ఎవ్వరికీ తెలియని అరుదైన రికార్డులు...

First Published 16, Nov 2020, 4:21 PM

సచిన్ టెండూల్కర్... క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరికీ, క్రికెట్ అంటే తెలియని వాళ్లకి కూడా బాగా తెలిసిన పేరు. క్రికెట్ ఆడని,చూడని వాళ్లు కూడా సచిన్ టెండూల్కర్ గురించి ఎక్కడో ఒకదగ్గర వినే ఉంటారు. అలాంటి సచిన్ టెండూల్కర్... క్రికెట్ ప్రపంచాన్ని వదిలి, రిటైర్మెంట్ తీసుకున్న రోజు నేడు.

2012 డిసెంబరులో వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సచిన్ టెండూల్కర్, 2013, అక్టోబరులో టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. నవంబర్ 16, 2013న తన ఆఖరి అంతర్జాతీయ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఆడాడు సచిన్ రమేశ్ టెండూల్కర్.

క్రికెట్‌లో సాధించిన అనితర సాధ్యమైన రికార్డుల ద్వారా అభిమానులతో ‘క్రికెట్ దేవుడి’గా ఆరాధించబడిన సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన కొన్ని అరుదైన రికార్డులు...

సచిన్ టెండూల్కర్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన రోజున... అంటే నవంబర్ 16, 2013న మాస్టర్ బ్లాస్టర్‌ను ఉద్దేశించి 3.5 మిలియన్ల ట్వీట్లు పోస్టు అయ్యాయి...

ఏడేళ్ల క్రితం ట్విట్టర్ అంటే సామాన్య జనాలకు ఇంకా తెలియని రోజుల్లో దాదాపు 35 లక్షల ట్వీట్లు రావడం ఇప్పటికీ ఓ రికార్డే... నేడు స్టార్లుగా వెలుగొందిన క్రికెటర్లు ఎవ్వరూ 1 మిలియన్ ట్వీట్లు కూడా పొందలేకపోతున్నారు.

సచిన్ టెండూల్కర్ పేరుతో ట్రెండ్ అయిన ‘ThankYouSachin’ ట్వీట్‌కి పొంగిపోయిన మాస్టర్... ‘మీ సపోర్టు ఎప్పటికీ మరిచిపోలేనంటూ’ ట్వీట్ చేశాడు. ఏడేళ్ల క్రితమే ఈ ట్వీట్‌కి 17 వేల రీట్వీట్లు వచ్చాయి. ఆ సంవత్సరంలో అత్యధిక రీట్వీట్లు పొందిన ట్వీట్‌గా నిలిచింది సచిన్ పోస్టు.

మహాత్మా గాంధీ తర్వాత జనాల్లోకి అంతగా వెళ్లిపోయిన వ్యక్తి, పేరు సచిన్ టెండూల్కర్... అంటూ ఓ సంచలన కథనం ప్రచురించింది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. రూపాయి నోటుపై ఉండే గాంధీ ఎంత ఫేమస్ అయ్యాడో, క్రికెట్ బ్యాటు పట్టుకున్న సచిన్ అంతే ఫేమస్ అయ్యాడంటూ వెలువడిన ఈ కథనం సచిన్ క్రేజ్‌కి నిదర్శనం.

సచిన్ టెండూల్కర్ ఆఖరి టెస్టు మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక జెర్సీని డిజైన్ చేసింది బీసీసీఐ. బీసీసీఐ లోగో కింద ‘సచిన్ రమేశ్ టెండూల్కర్ 200వ టెస్టు’ అని రాసి ఉన్న జెర్సీని జట్టు సభ్యులందరూ ధరించారు. పూజారా ఇదే జెర్సీతో సెంచరీ చేయగా, రోహిత్ శర్మ ప్రెస్ మీట్‌కి హాజరయ్యాడు. ప్రెస్ మీట్‌లో మైక్ మీద కూడా ‘SRT 200’ అని రాసి ఉండడం విశేషం.

పాకిస్థాన్ జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ ముక్కుకు బౌన్సర్ బలంగా తగలడంతో గాయమైంది. దాంతో ‘పిల్లోడా ఇంటికెళ్లి పాలు తాగి రా...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ క్రికెటర్లు. అయితే బ్యాండేజ్ వేసుకుని బ్యాటింగ్ చేసిన 16 ఏళ్ల సచిన్ 57 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

1990లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు సచిన్ టెండూల్కర్. దీంతో అందరూ అతన్ని ‘స్కూల్ బాయ్’ అంటూ హేళన చేస్తూ, తిట్టడం మొదలెట్టారు. అయితే వాటిని పట్టించుకోని సచిన్ టెండూల్కర్, తర్వాత టెస్టులో 88 పరుగులు చేశాడు.

సచిన్ టెండూల్కర్ 88 పరుగుల వద్ద ఉన్నప్పుడు క్యాచ్ పట్టి, అవుట్ చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ జాన్ రైట్... ఆ తర్వాత భారత జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో మొదటి సెంచరీ చేసిన రోజే, ఈ పిల్లాడు 100 సెంచరీలు చేయగలడని చెప్పాడు జాన్ రైట్.

2003 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో కెన్యా క్రికెటర్ టికోలో భారత బౌలర్లను చీల్చి చెండాడాడు. దాంతో సచిన్ టెండూల్కర్‌కి బంతి అందించాడు గంగూలీ. సచిన్ బౌలింగ్‌లో మొదటి బంతిని బౌండరీకి పంపాడు టికోలో. ఆ తర్వాతి బంతికి అతన్ని అవుట్ చేశాడు సచిన్.

1995 ఆసియా కప్‌లో సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేసి తన మెయిన్ వికెట్ తీశాడు బంగ్లా బౌలర్ మహ్మద్ రఫీక్. 2000వ సంవత్సరంలో మొదటి టెస్టు ఆడుతున్న రఫీక్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు సచిన్ టెండూల్కర్.

2007లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో కెప్టెన్ ద్రావిడ్, ఆఖరి ఓవర్ వేసేందుకు సచిన్ టెండూల్కర్‌కి బంతి ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో అప్పటిదాకా బౌలింగ్ వేయని సచిన్ టెండూల్కర్, మొదటి బంతికి బౌండరీ ఇచ్చినా రెండో బంతికే డేంజరస్ బ్యాట్స్‌మెన్ కెంప్‌ను అవుట్ చేశాడు.

2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో మోర్తాజా 20 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఈ సమయంలో 50వ ఓవర్ వేసిన సచిన్ టెండూల్కర్, మోర్తాజాను అవుట్ చేశాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్టంపౌట్ చేశాడు.

వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన క్రికెటర్లలో అత్యధిక సగటు ఉన్న 90వ, 20వ దశకం క్రికెటర్ సచిన్ టెండూల్కర్.... 86.23 స్ట్రైయిక్ రేటుతో 44.83 సగటుతో పరుగులు చేశాడు సచిన్ టెండూల్కర్.

‘మేం సచిన్ టెండూల్కర్‌ను మొదటిసారి కరాచీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే చూశాం. 14 ఏళ్ల కుర్రాడిలా కనిపించాడు. వకార్ యూనిస్, నేను ఒకరి మొఖాలు ఒకరం చూసుకున్నాం... ఈ పిల్లాడు ఏం చేయగలడు.... అని నవ్వుకున్నాం. ఇప్పుడు చూస్తే 2 దశాబ్దాలుగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్నాడు ఆ కుర్రాడు...’ అంటూ సచిన్ టెండూల్కర్ గురించి చెప్పుకొచ్చాడు మాజీ పాక్ క్రికెటర్, కెప్టెన్ వసీం అక్రమ్.

మొదటి టెస్టు మ్యాచులో 15 పరుగులు చేసి అవుటైన సచిన్ టెండూల్కర్, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే సమయానికి 15 వేలకు పైగా పరుగులు సాధించాడు... మొదటి మ్యాచులో 24 బంతులు ఆడిన సచిన్, 24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్‌ను కొనసాగించాడు.