- Home
- Sports
- Cricket
- సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీయే బెస్ట్! ఎందుకంటే... శుబ్‌మన్ గిల్ షాకింగ్ ఆన్సర్...
సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీయే బెస్ట్! ఎందుకంటే... శుబ్‌మన్ గిల్ షాకింగ్ ఆన్సర్...
క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ రికార్డుల రారాజు. సచిన్ క్రియేట్ చేసిన రికార్డుల గురించి రాయడానికి ఓ పుస్తకం సరిపోదు. టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డులు ఒక్కొక్కటిగా చెరిపేసుకుంటూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరిలో ఎవరు గ్రేట్? అనే ప్రశ్న వైరల్ అవుతోంది...

సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో 51 సెంచరీలు చేస్తే, విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో జెట్ స్పీడ్‌లో 46 సెంచరీలు చేసేశాడు. సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేస్తే, విరాట్ ఈ రికార్డును చెరిపేసి 50 సెంచరీల క్లబ్ క్రియేట్ చేయడానికి మరో నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు...
టెస్టుల్లో మాత్రం సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోవడం విరాట్ కోహ్లీకి అయ్యే పనిలా కనిపించడం లేదు. అప్పుడెప్పుడో మూడున్నరేళ్ల క్రితం టెస్టుల్లో 27వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ... ఆ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో శతకాన్ని అందుకోలేకపోతున్నాడు...
sachin kohli
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల్లో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు స్టీవ్ స్మిత్ ఈ విధంగానే సమాధానం చెప్పాడు. ‘టెస్టుల్లో సచిన్ టెండూల్కర్, వైట్ బాల్ క్రికెట్‌లో అయితే విరాట్ కోహ్లీయే.. వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ అద్భుత ఆటగాడు...’ అని సమాధానం చెప్పాడు స్టీవ్ స్మిత్...
shubman gill
తాజాగా భారత యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కి ఇదే ప్రశ్న ఎదురైంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీతో 360 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు. ఈ సందర్భంగా గిల్‌కి ‘సచిన్ టెండూల్కర్ లేదా విరాట్ కోహ్లీ’ అనే ప్రశ్న ఎదురైంది...
‘నా వరకూ విరాట్ భాయ్... సచిన్ సార్ వల్లే నేను క్రికెట్ ఆడడం మొదలెట్టా. ఎలాగంటే సచిన్‌కి మా నాన్న వీరాభిమాని. అందుకే నన్ను క్రికెట్‌గా మార్చాలని ఆయన కలలు కన్నారు. ఆయన క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకునే సమయానికి నేను ఇంకా చిన్న పిల్లాడినే...
నేను క్రికెట్‌ని అర్థం చేసుకోవడం మొదలెట్టాక నాకున్న రోల్ మోడల్ విరాట్ భాయ్. విరాట్ ఆటను చూస్తూ పెరిగాను. ఆయన బ్యాటింగ్ నుంచి ఎంతో నేర్చుకున్నా. అందుకే నాకు విరాట్ భాయ్ రోలో మోడల్...’ అంటూ చెప్పుకొచ్చాడు శుబ్‌మన్ గిల్...